WBF World Championships | క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్.. ముగిసిన లక్ష్యసేన్ పోరాటం
WBF World Championships : వరల్డ్ చాంపియన్‌షిప్స్(WBF World Championships)లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy) జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అతను క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రణయ్‌కి ఇది వరుసగా మూడో క్వార్టర్ ఫైనల్...
WBF World Championships : వరల్డ్ చాంపియన్‌షిప్స్(WBF World Championships)లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy) జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అతను క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రణయ్‌కి ఇది వరుసగా మూడో క్వార్టర్ ఫైనల్ కావడం విశేషం. 16వ రౌండ్లో 9వ సీడ్ ప్రణయ్ సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యేవ్(Loh Kean Yew)పై 21-18 15-21 21-19తో గెలుపొందాడు.
క్వార్టర్స్‌లో అతను ఒలింపిక్ విజేత విక్టర్ అక్సెల్సెన్(Viktor Axelsen)ను ఢీ కొనే అవకాశం ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటివరకూ సెమీఫైనల్ చేరని ప్రణయ్ ఈసారి ఆ అడ్డంకిని అధిగమిస్తాడా? లేదా? అనేది చూడాలి.
Prannoy into the Quarterfinals of #BWFWorldChampionships after a thrilling match against the Former World Champion 💥👏
📸: @badmintonphoto#BWFWorldChampionships#Copenhagen2023#IndiaontheRise#BadmintonTwitter#Badminton pic.twitter.com/zwUbdB4Zgj
— BAI Media (@BAI_Media) August 24, 2023
మరోవైపు.. భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్(Lakshya Sen) ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2021లో కాంస్య పతకం గెలిచిన అతను మూడో సీడ్ కున్లవుత్ విటిద్సర్న్(Kunlavut Vitidsarn) చేతిలో కంగుతిన్నాడు. మొదటి సెట్ కోల్పోయిన అతను రెండో సెట్లో పుంజుకున్నా లాభం లేకపోయిందు. ఇక మహిళల డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. గాయత్రీ గోపించంద్, జాలీ త్రీసా ద్వయం చైనాకు చెందిన చెన్ కింగ్ చెన్, జియ యీ ఫాన్ చేతిలో ఓటమి పాలైంది. 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 14-21, 9-21తో మ్యాచ్ చేజార్చుకుంది.
ఇవి కూడా చదవండి
Babar Azam | అఫ్గనిస్థాన్‌పై హాఫ్ సెంచరీ.. పాక్ మాజీ కెప్టెన్ రికార్డు బ్రేక్ చేసిన బాబర్
Javelin throwers | చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్స్.. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన ముగ్గురు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

