Rupali Ganguly : లోక్సభ ఎన్నికల వేళ ప్రముఖ నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ హయాంలో ఒక యజ్ఞంలా జరుగుతున్న అభివృద్ధి పనుల చూసి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆ యజ్ఞంలో తాను కూడా ఒక భాగం కాదలుచుకున్నానని అన్నారు.
టీవీ సీరియల్ ‘అనుపమ’ ద్వారా ఆమె జనాల్లో గొప్ప పేరు సంపాదించారు. బీజేపీ కండువా కప్పుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో మహాయజ్ఞంలా జరుగుతున్న అభివృద్ధిని చూసి నేను కూడా ఈ యజ్ఞంలో భాగం కావాలని అనుకున్నా. అందుకే బీజేపీలో చేరా. నా మీ అందరి దీవెనలు, మద్దతు ఎప్పటికీ కావాలి’ అని అన్నారు.
#WATCH | Actress Rupali Ganguly joins BJP at the party headquarters in Delhi. pic.twitter.com/CjRafwFd3W
— ANI (@ANI) May 1, 2024