Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ ఆటగాడు వన్డేల్లో మాజీ కెప్టెన్ మిస్బాహుల్ హక్(Misbah Ul Haq) రికార్డును బ్రేక్ చేశాడు. అఫ్గనిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో(53) హాఫ్ సెంచరీ కొట్టిన బాబర్ మిస్బా (5,122 పరుగులు)ను దాటేశాడు. ప్రస్తుతం పాక్ కెప్టెన్ ఖాతాలో 5,142 పరుగులు ఉన్నాయి. ఈ మధ్యే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League)లో బాబర్ సత్తా చాటాడు. కొలంబో స్ట్రయికర్స్(Colombo Strikers) తరఫున సెంచరీతో చెలరేగాడు.
రెండో వన్డేలో అఫ్గనిస్థాన్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (151) సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ 52 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మూడో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన బాబర్ 66 బంతుల్లో 4 ఫోర్లతో 53 రన్స్ కొట్టాడు.
మిస్బాహుల్ హక్, బాబర్ ఆజాం
ఇమామ్ ఉల్ హక్(91)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలుపొందింది. నసీం షా(10 నాటౌట్) సంచలన ఆటతో జట్టును గెలిపించాడు. రెండు వన్డేల్లో విజయం సాధించిన పాక్ 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే ఆగస్టు 26న జరుగనుంది.