Rahmanullah Gurbaz : అఫ్గనిస్థాన్ స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz) అరుదైన ఫీట్ సాధించాడు. వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు శతకాలు(Fastest 5 Centuries) బాదిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్ రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌పై రెండో వన్డేలో వీరోచిత సెంచరీ బాదిన అతను ఐదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam)ను వెనక్కి నెట్టేశాడు. విధ్వంసక ఓపెనర్ అయిన గుర్బాజ్ 19 ఇన్నింగ్స్‌ల్లోనే 5 సెంచరీలు బాదాడు. ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్ అయిన బాబర్‌కు మాత్రం ఐదు శతకాలకు 25 ఇన్నింగ్స్‌లు పట్టింది.
అత్యంత వేగంగా ఐదు సెంచరీలు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్వింటన్ డికాక్(Quinton De Kock) టాప్‌లో ఉన్నాడు. ఈ దక్షిణాఫ్రికా ఓపెనర్ 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్(19 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక బ్యాటర్ ఉపుల్ తరంగ(Upul Tharanga) ఐదో స్థానంలో నిలిచాడు. తరంగ 28 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీల మార్క్ అందుకున్నాడు.
Rahmanullah Gurbaz is enjoying a dream start to his ODI career 😍
✍: https://t.co/fy01mo7say pic.twitter.com/Jk9fK4BkXM
— ICC (@ICC) August 25, 2023
ఐపీఎల్ 16వ సీజన్లో దంచి కొట్టిన గుర్బాజ్ వన్డేల్లో అదే జోరు చూపించాడు. తొలి వన్డేలో విఫలమైన అతను రెండో వన్డేలో పాక్ బౌలర్లను ఉతికారేశాడు. ధనాధన్ బ్యాటింగ్ చేసి సెంచరీతో కదం తొక్కాడు. 151 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 151 రన్స్ చేశాడు. దాంతో, అఫ్గన్ జట్టు 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని పాక్ ఒక్క బంతి ఉండగానే ఛేదించింది. దాంతో, సిరీస్ సమం చేయాలనుకున్న అఫ్గనిస్థాన్‌కు నిరాశే మిగిలింది.