Virat Kohli | కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్!.. మరోసారి అలా చేయొద్దంటూ మందలింపు
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విరాట్ తన యో- యో(yo -yo test) స్కోర్‌ను ఆన్లైన్లో పెట్టడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో ప్లేయర్లకు...
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విరాట్ తన యో- యో(yo -yo test) స్కోర్‌ను ఆన్లైన్లో పెట్టడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో ప్లేయర్లకు బోర్డు యో-యో టెస్టు నిర్వహించింది. ఇందులో పాస్ అయినట్టు కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాంతో పాటు తనకు వచ్చిన స్కోరును కూడా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో బీసీసీఐ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తి చేసినట్లు ఓ అధికారి తెలిపారు. అధికారిక సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తేటతెల్లం చేయడం తగదని కోహ్లీని హెచ్చరించినట్లు ఆ అధికారి పేర్కొన్నారు.
‘జట్టుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించకూడదు. శిక్షణ సందర్భంగా దిగిన ఫొటోలను కొందరు ప్లేయర్లు అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో పాటు యో – యో టెస్టు స్కోరు వివరాలు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది బీసీసీఐ కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాం’ అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఆసియా కప్‌లో భారత జట్టు వచ్చే నెల 2న తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే!
దుష్ప్రచారంతో…
ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. దాంతో, ఎన్సీఏలో ఆటగాళ్లకు యో – యో టెస్టు నిర్వహించారు. గురువారం టెస్టుకు హాజరైన కోహ్లీ తనకు 17.2 పాయింట్లు దక్కాయని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. దీంతో బోర్డు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్టులో 16.5 పాయింట్లు సాధించాలి. ఫిట్‌నెస్‌లో అందరికీ ఆదర్శంగా నిలిచే కోహ్లీకి 17.2 పాయింట్లు రావడంతో మిగిలిన ప్లేయర్లు ఈ టెస్టులో పాస్ కాలేదనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

