Emerging Asia Cup : టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత ఏ (India A) జట్టు రెండో విజయంపై కన్నేసింది. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ను స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసింది. యువ పేసర్ రసిక్ దార్ సలాం(3/15)కు తోడు ఐపీఎల్ హీరో రమన్‌దీప్ సింగ్(2/7) నిప్పులు చెరగడంతో యూఏఈ 107 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి సహచరులంతా చేతులెత్తేయగా రాహుల్ చోప్రా(50) అర్ధ శతకంతో రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ బసిల్ హమీద్(22) రాణించడంతో యూఏఈ ఆ మత్రం స్కోర్ చేయగలిగింది.
మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలుపొందిన భారత ఏ జట్టు రెండో మ్యాచ్‌లో పంజా విసిరింది. బౌలర్లు చెలరేగడంతో పసికూన యూఏఈని 107 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న యూఏఈ 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ రాజేశ్ కుమార్(10)ను అన్షుల్ కాంబోజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత రసిక్ దార్ సలాం(315), రమన్‌దీప్ సింగ్(27)లు యూఏఈ బ్యాటర్లను వణికించారు. ఈ ఇద్దరి జోరుతో 39 పరుగులకే సగం వికెట్లు పడ్డాయి.
Innings break!
A brilliant bowling display from India A restricts UAE to 107 in the first innings 👏👏
Stay tuned for our chase!
Scorecard ▶️ https://t.co/UdWFgOvvwc#INDAvUAE | #ACC | #MensT20EmergingTeamsAsiaCup pic.twitter.com/aXIa7yjQlB
— BCCI (@BCCI) October 21, 2024
ఓవైపు వికెట్లు పడుతున్నా రాహుల్ చోప్రా(50 : 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి కెప్టెన్ బసిల్ హమీద్(22) చక్కని సహకారం అందించాడు. దాంతో, యూఏఈ స్కోర్ వంద దాటింది. అయితే.. అర్ధ శతకం బాదిన రాహుల్‌ను నేహల్ వధేరా ఔట్ చేయడంతో 107 వద్ద ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. స్వల్ప లక్ష్యాన్ని యువ భారత్ అలవోకగా ఛేదించడం ఖాయం. దాంతో, 4 పాయింట్లతో తిలక్ వర్మ బృందం గ్రూప్ ఏలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లుతుంది.