లక్నో: కర్వా చౌత్ జరుపుకునేందుకు లేడీ కానిస్టేబుల్ తన సొంత గ్రామానికి బయలుదేరింది. బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన తెలిసిన వ్యక్తి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. (Woman Constable Raped) బాధిత లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయోధ్యలోని రిజర్వ్ పోలీస్ అనుబంధ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్, ‘కర్వా చౌత్’ జరుపుకునేందుకు శనివారం తన సొంత గ్రామానికి బయలుదేరింది.
కాగా, కాన్పూర్ చేరుకున్న ఆ లేడీ కానిస్టేబుల్‌కు ఆమెకు తెలిసిన పొరుగున ఉండే ధర్మేంద్ర పాశ్వాన్ బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. అయితే రాత్రి వేళ ఏకాంత ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అతడి వేలు కొరకడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
అనంతరం బాధిత లేడీ కానిస్టేబుల్ సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్ట్ వద్దకు వెళ్లింది. తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ధర్మేంద్రను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు వెల్లడించారు.