Dulquer Salmaan | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పాడు.
కల్కిలో మీరున్నారంటూ ఒక సస్సెన్స్ క్రియేట్ చేశారని టాక్ ఉందని యాంకర్ అడుగగా.. సినిమాలో నేనున్నానని చివరివరకు తెలియదన్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). దీని గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. నేను జనవరిలో షాట్ చేశాను. సినిమా మేలో విడుదలైంది. గతేడాది నన్ను సినిమా గురించి అడిగారు. నాకప్పుడు తెలియదు. అప్పటినుంచి సినిమాలో నేను ఓ కామియో చేయాలని నాగ్ అశ్విన్‌ను అడిగేవాడిని.
ఆ తర్వాత కల్కి 2898 ఏడీ సెట్ చూశా. చాలా బాగా నచ్చింది. ఆ ప్రపంచాన్ని చూడాలనుకున్నా. నువ్వు ఏది చెప్పినా అది చేస్తానని చెప్పా. నాగ్ అశ్విన్ ఒకే చూద్దామన్నాడు. ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జనవరి వరకు కల్కిలో నేనున్నానన్న విషయం నాకు తెలియదన్నాడు.
మీరు కామియోను ఎంజాయ్ చేశారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చాలా బాగా ఎంజాయ్ చేశా. నా కెరీర్లో చేసిన ప్రతీ పాత్ర నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి లెంగ్త్ ఎచేశా. ప్రతీ కామియో ఇష్టం. ప్రేక్షకులు ప్రతీ కామియో పట్ల ఎక్జయిట్మెంట్కు లోనయ్యారంటూ చెప్పుకొచ్చాడు.
Kanguva | అభిమానులతో సూర్య, దిశాపటానీ సెల్ఫీ.. ఇంతకీ కంగువ టీం ఎక్కడుందో తెలుసా..?
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు