ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 22:26:31

బర్త్‌డే రోజున క్రికెట్‌కు గుడ్‌బై

బర్త్‌డే  రోజున క్రికెట్‌కు గుడ్‌బై

చెన్నై: తమిళనాడు సీనియర్‌ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ సీమర్‌ విజయ్‌ కుమార్‌ యో మహేశ్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికాడు. తన 33వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం విశేషం.  2006 నుంచి  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తమిళనాడు తరఫున ఆడిన విజయ్‌ 108 వికెట్లు పడగొట్టారు. 2019 ఆగస్టులో చివరి మ్యాచ్‌ ఆడాడు. 32ఏండ్ల  పేసర్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  శ్రీలంకలో జరిగిన 2006 ప్రపంచకప్‌ టోర్నీకి భారత అండర్‌-19   జట్టులో దక్కించుకోవడంతో మహేశ్‌ కెరీర్‌ ప్రారంభమైంది. 


logo