Colin Munro | క్రైస్ట్‌చర్చ్: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ హార్డ్‌హిట్టర్ కొలిన్ మున్రో వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్ 1నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కివీస్ జట్టులో చోటు దక్కకపోవడంతో మున్రో రిటైర్మెంట్కు కారణమైంది. తన కెరీర్లో ఒక టెస్టు, 57వన్డేలు, 65 టీ20లు ఆడిన 37 ఏండ్ల మున్రో అన్ని ఫార్మాట్లు కలిపి 3010 పరుగులు చేశాడు.
ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌పై తనదైన ముద్ర వేసిన ఈ డాషింగ్ బ్యాటర్ 65 మ్యాచ్‌ల్లో 156 స్ట్రైక్‌రేట్‌తో 1724 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. దీనికి తోడు వివిధ దేశాల్లో 428 టీ20లు లీగ్‌లు ఆడిన మున్రో 10,961 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ‘న్యూజిలాండ్ జట్టుకు ఆడటం ఎప్పటికైనా గర్వకారణం’ అని అన్నాడు.