మీతో మమేకమయ్యా.. కట్టుబడి పని చేస్తా..
‘ఇన్నాళ్లూ మీలో ఒకడిగా ఉంటూ మమేకమయ్యా. మీరు ఓటేసి ఆశీర్వదిస్తే మీ బాగు కోసం కట్టుబడి పని చేస్తా’ అంటూ ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరావు వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గురువారం ఉదయం మధిరలో కలయిక వాకర్స్ క్లబ్, స్విమ్మర్స్ క్లబ్, కొలగాని టౌన్ షిప్‌లలో పర్యటించిన ఆయన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.
- ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
- మధిరలో వాకర్స్ క్లబ్, మార్కెట్లో విస్తృత ప్రచారం
మధిర, మే 9 : ‘ఇన్నాళ్లూ మీలో ఒకడిగా ఉంటూ మమేకమయ్యా. మీరు ఓటేసి ఆశీర్వదిస్తే మీ బాగు కోసం కట్టుబడి పని చేస్తా’ అంటూ ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరావు వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గురువారం ఉదయం మధిరలో కలయిక వాకర్స్ క్లబ్, స్విమ్మర్స్ క్లబ్, కొలగాని టౌన్ షిప్‌లలో పర్యటించిన ఆయన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అడ్డా కార్మికులను, కూరగాయల మార్కెట్ వ్యాపారులు, కొనుగోలుదారులను ఓట్లు అభ్యర్థిస్తూ వారితో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజాసేవలో నిమగ్నమయ్యానని తెలిపారు. తన తండ్రి నామా ముత్తయ్య ట్రస్టు పేర ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేశానన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలిపిస్తే అపరిష్కృత సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు మొండితోక జయాకర్, పార్టీ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతుల వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, కృష్ణప్రసాద్, భాస్కర్‌రెడ్డి, యన్నంశెట్టి అప్పారావు, కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు బాలకోటేశ్వరరావు, యార్లగడ్డ నరసింహారావు, స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

