కాంగ్రెస్‌వి గ్యారెంటీ లేని హామీలు
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
- ఇల్లెందు రోడ్ షోలో మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత
- ఆళ్లపల్లి, గుండాలలో ముఖ్య కార్యకర్తల సమావేశం
ఇల్లెందు, మే 9 : మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఏమీ చేయకుండా ఇప్పుడు దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతోందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చి గర్జించిన తర్వాతే రేవంత్ రైతుబంధు ఇస్తున్నారన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి గత కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. పదేళ్లు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, నాయకులు దిండిగాల రాజేందర్, జేకే శ్రీను, సిలివేరు సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, శీలం రమేశ్, గిన్నారపు రాజేశ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గెలిపిస్తే ప్రజల గొంతుకనవుతా.. మీ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా..
ఆళ్లపల్లి/గుండాల, మే 9 : కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ప్రజల గొంతుకను పార్లమెంట్లో వినిపిస్తానని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. గురువారం ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీ పరిధిలోని పెద్దురు గ్రామంలో జడ్పీటీసీ కొమురం హనుమంతరావు నివాసంలో, గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బూటకపు గ్యారెంటీతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల విధానాలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు మళ్లీ వచ్చాయని, రైతాంగం పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు పడుతోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంట్లో చర్చించి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి, ఆళ్లపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాయం నరసింహారావు, షేక్ బాబా, నాయకులు రాంబాబు, వెంకటేశ్, సతీశ్, సత్యం, రవి, సమ్మయ్య, భవాని శంకర్, వట్టం రాంబాబు, గుండాల బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తెల్లం భాస్కర్, రవీందర్‌రెడ్డి, రాంమూర్తి, శ్రీనివాస్, గుండ్ల రంజిత్, టి.రాము, అటికం నాగేశ్వరరావు, పొంబోయిన సుధాకర్, గొగ్గెల రాంబాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

