IND vs SA : దక్షిణాఫ్రికా పర్యటనలో అదిరే బోణీ కొట్టిన భారత జట్టు (Team India) రెండో మ్యాచ్‌లోనూ దుమ్మరేపాలనే పట్టుదలతో ఉంది. తొలి టీ20లో సఫారీలను సఫా చేసిన టీమిండియా కెబెర్హాలోనే సిరీస్ పట్టేయాలని అనుకుంటోంది. శతక వీరుడు సంజూ శాంసన్ మరో భారీ ఇన్నింగ్స్‌కు ఉత్సాహంగా ఎదురు చూస్తుండడం భారత్‌కు కలిసొచ్చేదే.
ఇక ఈ మ్యాచ్‌తో కుర్ర పేసర్లు యశ్ దయాల్ (Yash Dayal), విజయ్కుమార్లలో ఒకరు అరంగేట్రం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రమన్‌దీప్ సింగ్ (Ramandeep Singh) కూడా డెబ్యూట్ క్యాప్ అందుకోనున్నాడని సమాచారం. డర్బన్‌లో భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు సొంతగడ్డపై చతికిలబడిన సఫారీలు కసితో రగిలిపోతున్నారు.
📍 Gqeberha #TeamIndia | #SAvIND pic.twitter.com/kEgSvbu6Ql
— BCCI (@BCCI) November 9, 2024
ఎలాగైనా సరే రెండో టీ20లో విజయంతో సిరీస్ సమం చేయాలని మర్క్రమ్ సేన వ్యూహాలు పన్నుతోంది. దాంతో, ఆదివారం రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు తప్పకపోవచ్చు. అయితే.. కెబెర్హాలో మ్యాచ్‌క వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే.. ఓవర్లు కుదించే అవకాశ ముంది. ఇక జట్టు కూర్పు విషయానికొస్తే పిచ్‌ను బట్టి తుది జట్టు ఎంపిక ఉండనుంది.
భారత తుది జట్టు అంచనా : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ / రమన్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ / విజయ్‌కుమార్ / యశ్ దయాల్.