puppies burnt alive | నిద్రకు భంగం కలిగిస్తున్నాయని.. కుక్క పిల్లలకు నిప్పుపెట్టిన మహిళలు
puppies burnt alive | కుక్క పిల్లల శబ్దానికి తమ నిద్రకు భంగం కలుగుతున్నదని ఇద్దరు మహిళలు ఆగ్రహించారు. ఆ కుక్క పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించారు. వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యానిమల్ కేర్ సొసైటీ ఫిర్యాదుతో ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లక్నో: కుక్క పిల్లల శబ్దానికి తమ నిద్రకు భంగం కలుగుతున్నదని ఇద్దరు మహిళలు ఆగ్రహించారు. ఆ కుక్క పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించారు. వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. (puppies burnt alive) యానిమల్ కేర్ సొసైటీ ఫిర్యాదుతో ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. కంకేర్‌ఖేడా ప్రాంతానికి చెందిన ఒక వీధి కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ కుక్క పిల్లల శబ్దాలకు తమ నిద్రకు భంగం కలుగుతున్నదని అదే ప్రాంతంలోని ఒక కుటుంబానికి చెందిన శోభ, ఆర్తి ఆరోపించారు. ఐదు కుక్క పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులతో వాగ్వాదానికి దిగారు.
కాగా, ఐదు కుక్క పిల్లలు సజీవ దహనమయ్యాయి. కాలి మరణించిన వాటిని స్థానికులు పూడ్చి పెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో యానిమల్ కేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ అన్షుమాలి వశిష్ఠ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. కుక్క పిల్లల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వాటిని సజీవ దహనం చేసిన శోభ, ఆర్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- burnt alive
- Meerut
- puppies
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

