WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మెగా వేలానికి మరో ఆరు రోజులే ఉంది. ఢిల్లీ వేదికగా మ్యాచ్ విన్నర్లను కొనేందుకు ఐదు ఫ్రాంచైజీలు గట్టి కసరత్తే చేస్తున్నాయి. ఈసారి వేలంలో 277 మంది పేర్లు నమోదు చేసుకోగా.. వీరిలో 194 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఆక్షన్ బరిలో ప్రపంచకప్ స్టార్లు దీప్తి శర్మ, లారా వొల్వార్డ్త్, అలీసా హేలీతో పాటు అన్క్యాప్డ్ క్రికెటర్లూ ఉన్నారు. అత్యధిక కనీస ధర రూ.50 లక్షల నుంచి అత్యల్పం రూ.20 లక్షల జాబితాలోని అమ్మాయిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి.. వేలంలో పాల్గొంటున్న వారి వివరాలు తెలుసుకుందామా.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడిన పలువురు స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలోకి వస్తున్నారు. వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విజేత దీప్తి శర్మ నుంచి.. రెండు శతకాలతో మెరిసిన లారా వొల్వార్డ్త్, ఎలీసా హీలీ, వన్డేలకు వీడ్కోలు పలికిన సోఫీ డెవినె వంటి దిగ్గజ క్రికెటర్లు భారీ ధర పలికే అవకాశముంది. వేలంలో 277 మంది పాల్గొంటున్నా 73 మందికే అవకాశముంది. 194 మంది భారత క్రికెటర్లలో52 మంది క్యాప్డ్, 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 50 స్థానాలు మనోళ్లకు.. తక్కిన 23 విదేశీ క్రికెటర్లకు వర్తిస్తాయి. ఇక.. 83 మంది ఓవర్సీస్ క్రికెటర్లలో 66 మంది క్యాప్డ్ కాగా.. 17 మంది అన్క్యాప్డ్.
🚨 NEWS 🚨#TATAWPL 2026 Player Auction List Announced.
The #TATAWPLAuction 2026 list has been announced, with a total of 277 players vying for 73 available slots. The auction will take place in New Delhi on 27th November at 3:30 PM IST.
Details 🔽https://t.co/1hTLRHqzEL
— Women’s Premier League (WPL) (@wplt20) November 21, 2025
నవంబర్ 27న మధ్యాహ్నం 3:30కి వేలం షురూ కానుంది. అత్యధిక కనీస ధర విషయానికొస్తే.. రూ.50 లక్షలు. ఈ ధరతో19 మంది ఉండగా.. రూ.40 లక్షలకు 11 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అత్యధికంగా రూ.30 లక్షల గ్రూప్‌లో 88 మంది రిజిష్టరయ్యారు. రూ.20 లక్షలు, రూ.10 లక్షల కనీస ధరలో అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నారు.
50 లక్షలు: దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, ప్రతీకా రావల్, ఉమా ఛెత్రీ, పూజా వస్త్రాకర్ (భారత్), సోఫీ డెవినె, అమేలియా కేర్ (న్యూజిలాండ్), అలీసా హీలీ, మేగ్ లానింగ్, ఫొబే లిచ్‌ఫీల్డ్, జార్జియా వరేహం (ఆస్ట్రేలియా), సోఫీ ఎకిల్‌స్టోన్, హీథర్ నైట్, డానీవ్యాట్ (ఇంగ్లండ్).
🔨 WPL 2026 Auction
🗓️ November 27, 2025
📍 New Delhi pic.twitter.com/Egt6pXtaZ2— Cricbuzz (@cricbuzz) November 20, 2025
40 లక్షలు: రేణుకా సింగ్, కిరణ్ నవ్‌గిరే, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, మిన్ను మణి (భారత్), జార్జియా వొల్ (ఆస్ట్రేలియా)
30 లక్షలు: లారా వొల్వార్డ్త్(దక్షిణాఫ్రికా), స్నేహ్ రానా, రాధా యాదవ్, మేఘన్ ఎస్, భారతి ఫుల్మలి, టిటస్ సధు, సైకా ఇషాక్, ప్రియా మిశ్రా, అశా శోభన, స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి, సంజన ఎస్, యస్తికా భాటియా, తానియా భాటియా, సుష్మా వర్మ, సోనీ యాదవ్, ఎక్తా బిష్త్,(భారత్), షబ్నం ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా), మరుఫా అక్తర్(బంగ్లాదేశ్), ఇనొక రణవీరా(శ్రీలంక).
రూ.20 లక్షలు: సంస్కృతి గుప్తా, అమన్‌దీప్ కౌర్, అక్షిత మహేశ్వరి, సాయి దీప్తి, త్రివేణి వసిస్త(భారత్).
10 లక్షలు: సనికా చాల్కే, ప్రణవి చంద్ర, వ్రిందా దినేశ్, ఆరుషి గోయెల్, దిశా కసత్, దీయ యాదవ్, జి.త్రిష, షిప్రా గిరి, మిథాలీ వినోద్, హ్యాపీ కుమారి (భారత్).
Here is the marquee set for the WPL 2026 Auction. 💥
Who will get the highest bid in the first set? 👀#WPL #Cricket #India #Sportskeeda pic.twitter.com/MbEMu8Jqtl
— Sportskeeda (@Sportskeeda) November 20, 2025