INDA vs BANA : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత ఏ జట్టుకు భారీ షాక్. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ధాటికి బ్యాటర్లు విఫలమైనా.. లోయరార్డర్ పోరాటంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. కానీ, ఒత్తిడికి తలొగ్గిన టీమిండియా థ్రిల్లర్‌లో ఓడిపోయింది. 195 పరుగుల ఛేదనలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(44), వైభవ్ సూర్యవంశీ(38)లు శుభారంభమిచ్చినా మిడిలార్డర్ తేలిపోయింది. సూపర్ ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో బంగ్లా పేసర్ రిప్పన్ రెండు వికెట్లు తీయగా.. ఆ తర్వాత ఒక వికెట్ కోల్పోయిన బంగ్లా లక్ష్యాన్ని చేరుకొని తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో మరో ఉత్కంఠ పోరు. ఈసారి ఫలితం మాత్రం భారత ఏ జట్టుకు కలిసిరాలేదు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ప్రత్యర్ధికి భారీ స్కోర్ సమర్పించుకున్న భారత జట్టు మూల్యం చెల్లించుకుంది. ఛేదనలో ఓపెనర్లు అదిరే ఆరంభమిచ్చినా మిడిలార్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. ఆఖరి ఓవర్లో అశుతోష్ శర్మ(13) సిక్స్, ఫోర్.. చివరి బంతికి హర్ష్ దూబే(3 నాటౌట్) మూడు సింగిల్స్ తీసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. కానీ.. అందులోనూ బ్యాటర్లు నిరాశపరచగా టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది.
INDA: 0/2 (0.2)
BANA: 1/1 (0.1)Bangladesh A win the thriller against India A to become the first finalists of the Rising Stars T20 Asia Cup 2025 🏏
📸: SonyLIV #BANAvsINDA #SF #AsiaCup #T20 #Insidesport #CricketTwitter pic.twitter.com/d5eQYRB8v4
— InsideSport (@InsideSportIND) November 21, 2025
ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. అశుతోష్ శర్మ(13) మూడో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతికి మిడాఫ్‌లో ఫీల్డర్ క్యాచ్ వదిలేయగా బౌండరీ వచ్చింది. కానీ, ఐదో బంతికి పెద్ద షాట్ ఆడబోయిన అశుతోష్ క్లీన్ బౌల్డయ్యాడు. చివరి బంతికి హర్ష్ దూబే(3 నాటౌట్) మూడు రన్స్ తీయగా స్కోర్లు సమం అయ్యాయి.
సూపర్ ఓవర్ ఆడేందుకు జితేశ్ శర్మ(), రమన్‌దీప్ సింగ్ క్రీజులోకి వచ్చారు. రిప్పన్ మొండల్(2-0) వేసిన తొలి బంతికి స్కూప్ షాట్ ఆడబోయిన జితేశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంతికే అశుతోష్ శర్మ(0) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో.. బంగ్లా విజయానికి ఒక్క రన్ అవసరమైంది. అయితే. సుయాశ్ శర్మ వేసిన మొదటి బంతినే సిక్సర్‌కు యత్నించిన యాసిర్ బౌండరీ వద్ద రమన్‌దీప్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత బంతికి సుయాశ్ వైడ్ వేయడంతో గెలుపొందిన బంగ్లాదేశ్ తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.