South Africa : భారత గడ్డపై పదిహేనేళ్ల తర్వాత తొలి టెస్టు విజయంతో దక్షిణాఫ్రికా ఫుల్ జోష్‌లో ఉంది. అదే ఉత్సాహంతో గువాహటిలోనూ గెలుపుపై కన్నేసిన ఆ జట్టుకు భారీ షాక్. మొదటి మ్యాచ్‌కు దూరమైన ప్రధాన పేసర్ కగిసో రబడ (Kagiso Rabada) రెండో మ్యాచ్ కూడా ఆడడం లేదు. గురువారం సహచరులతో కలిసి నెట్స్ సెషన్లో పాల్గొనని రబడ గువాహటి టెస్టుకూ దూరమయ్యాడని శుక్రవారం ఆ టీమ్ కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) వెల్లడించాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో సంచలన విక్టరీతో ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా సిరీస్ పట్టేయాలనుకుంటోంది. గువాహటి టెస్టుకు పక్కాగా సిద్ధమవుతున్న సఫారీ టీమ్ పేసర్ కగిసో రబడ సేవల్ని కోల్పోనుంది. గురువారం నెట్స్‌లో రబడ బౌలింగ్ చేయకపోవడంతో అతడు ఆడడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. బౌలింగ్ కోచ్ పియెట్ బొథా (Piet Botha) 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. కానీ, అతడి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో గువాహటి టెస్టుకు పక్కన పెట్టేశారు.
Temba Bavuma has confirmed that Kagiso Rabada is ruled out for the Guwahati Test #tembabavuma #indvssa #kagisorabada #CricketTwitter pic.twitter.com/Reyh3CudC5
— Cricbuzz (@cricbuzz) November 21, 2025
‘పక్కటెముకల గాయంతో బాధపడుతున్న రబడ ఇంకా కోలుకోలేదు. అందుకే అతడు రెండో టెస్టు ఆడడం లేదు. గువాహటి పిచ్‌ను పరిశీలించాను. అది ఉపఖండంలోని వికెట్ మాదిరిగానే ఉంది. మొదట బ్యాటర్లకు ఆపై స్పిన్నర్లకు అనుకూలించేలా పిచ్ ఉంది. ప్రస్తుతమైతే వికెట్ చాలా తాజాగా కనిపిస్తోంది. కోల్‌కతా వికెట్ మాదిరిగా అనూహ్యంగా టర్న్ తీసుకోదని అనుకుంటున్నా. మ్యాచ్ రోజు ఉదయం మరోసారి పిచ్‌ను పరిశీలించి రబడ స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అనేది నిర్ణయిస్తాం. అతడి అవగాహన ప్రకారం ఆరంభంలో పిచ్ బౌన్స్ అవుతుంది. అయితే.. మ్యాచ్ సాగే కొద్ది స్లో బౌలర్లకు అనుకూలంగా మారుతుంది’ అని బవుమా వెల్లడించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో తొలి రెండు రోజులు వెనకబడిన సఫారీ టీమ్ అనూహ్యంగా 30 పరుగుల తేడాతో భారత్‌కు షాకిచ్చింది.
Eyes on the game, not noise. 😃#INDvsSA pic.twitter.com/P42r2BC3wj
— Temba Bavuma 🧢 (@Temba_bavuma11) November 16, 2025
సిరీస్‌లో ముందంజలో ఉన్న సఫారీ టీమ్‌కు చెక్ పెట్టాలనుకున్న భారత్‌కు మ్యాచ్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో రిటైర్ట్ హర్ట్ అయిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి నుంచి కోలుకుంటున్నందున జట్టుకు దూరమయ్యాడు. దాంతో.. వైస్ కెప్టెన్ పంత్ గువాహటిలో సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ వేదికపై ఇదే మొదటి టెస్టు కావడంతో గెలిచేది ఎవరు? పిచ్ ఎలా స్పందిస్తుంది? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 22న రెండో టెస్టు జరుగనుంది. తొందరగా సాయంత్రం కానున్న నేపథ్యంలో మ్యాచ్ 9 గంటలకే షురూ కానుండగా.. లంచ్‌కు ముందే టీ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకే తొలి రోజు ఆట ముగియనుంది.
📍 Guwahati #TeamIndia all locked in for the 2⃣nd Test 💪#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/Xhtu41QjYM
— BCCI (@BCCI) November 21, 2025