Sanju Samson: ఐపీఎల్ స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) తన డ్రీమ్ జట్టుకు ఆడబోతున్నాడు. పసుపు జెర్సీని ఎంతో ఇష్టపడే శాంసన్ పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున మైదానంలోకి దిగనున్నాడు. బిగ్ ట్రేడ్‌డీల్ ద్వారా ఇటీవలే చెన్నై గూటికి చేరిన సంజూ.. ఎంఎస్ ధోనీ(MS Dhoni)తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంపై అమితానందం వ్యక్తం చేశాడు. ఎంతోమందికి ఆరాధ్య క్రికెటర్, మిస్టర్ కూల్ అయిన ధోనీతో కలిసి ఆడడం, అతడితో డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం కోసం తాను ఎదురుచూస్తున్నానని చెబుతున్నాడీ టీ20 స్టార్.
ఐపీఎల్ 18వ సీజన్ ముగియడమే ఆలస్యం ఫ్రాంచైజీ మారేందుకు సిద్ధమైన సంజూ శాంసన్ చివరకు తన పంతం నెగ్గించుకున్నాడు. అది కూడా తాను ఎంతగానో అభిమానించే ధోనీ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు సంజూ. ధోనీ వారసుడిగా వికెట్ కీపింగ్, కెప్టెన్సీ రెండు బాధ్యతల్ని నిర్వహిస్తాడనే ఉద్దేశంతో శాంసన్‌ను సీఎస్కే తీసుకుంది. అయితే.. ఇప్పటికిప్పుడు అతడికి సారథ్యం అప్పగించే పరిస్థితులు లేవు. అయినా సరే తాను చాలా హ్యాపీ ఉన్నానంటున్నాడు సంజూ.
💛 for the badge! ✨
Watch the Sanju Samson exclusive interview!
Link : https://t.co/gntu33UcNJ #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/o2IZYQbIUy— Chennai Super Kings (@ChennaiIPL) November 21, 2025
‘ఒకేఒక వ్యక్తి ఉన్నాడు. అతడి గురించి మనందరికి తెలుసు. అతడి పేరు ఎంఎస్ ధోనీ. నేను 19 ఏళ్లప్పుడు ధోనీని మొదటిసారి చూశాను. ఆ ఏడాదే జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు మహీభాయ్నే మా కెప్టెన్. ఆయనతో మాట్లాడడం అదే తొలిసారి. ఆ సిరీస్ సమయంలో 10-20 రోజులు ధోనీతో మాట్లాడాను. ఆ తర్వాత ఐపీఎల్లో తరచూ మహీని చూశాను. అతడు ఎక్కడున్నా జనం చట్టుముట్టేవారు. అప్పుడు అతడిని కలవడం కష్టమనిపించేది. ప్రత్యేకంగా కలవాల్సి ఉంటుంది అనుకున్నా’ అని శాంసన్ మాట్లాడిన పాత వీడియోను సీఎస్కే తమ ఎక్స్ ఖాతాలో పెట్టింది.
“Felt like a champion.” – Sanju
In Yellove, the spirit chooses you 💛 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Eh4S0G5Am9— Chennai Super Kings (@ChennaiIPL) November 19, 2025
అంతేకాదు తను ఎన్నో ఏళ్ల నిరీక్షణ త్వరలోనే ఫలించనుందని ఈ సీఎస్కే ప్లేయర్ తెలిపాడు. ‘నాకొక కోరిక ఉండేది. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనేది నా కల. ఇన్నాళ్లకు విధి కరుణించింది. మా ఇద్దరిని ఒక్కచోటకు చేర్చింది. ధోనీని కలిసేందుకు ఎంతో ఆతృతతో ఉన్నాను. అతడితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం, మ్యాచ్ ఆడడం.. ఇవన్నీ నన్ను చాలా సంతోషపరుస్తాయి’ అని శాంసన్ తన మనసులోని మాటల్ని పంచుకున్నాడు.