కట్టంగూర్, నవంబర్ 21 : కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడెం మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు సీహెచ్.సైదులు, సరిత ద్విచక్ర వాహనంపై కట్టంగూర్ మండలం ఇస్మాయిపల్లి జీపీ పరిధి గల గొల్లగూడెం గ్రామంలో జరిగిన బంధువు దశదిశ కర్మకు హాజరయ్యారు. అనంతరం తిరిగి స్వగ్రామం వెళ్తూ ఎరసానిగూడెం స్టేజీ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో కోదాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైదులు రెండు కాళ్లు విరిగిపోగా, సరిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 ఈఎంటీ రాధ, పైలెట్ మహేశ్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చిక్సిత చేసి అనంతరం కామినేని ఆస్పత్రికి తరలించారు.

Kattangur : బైక్ను ఢీకొన్న కారు.. భార్యాభర్తలు తీవ్రగాయాలు