IND vs NZ 1st Test : టాపార్డర్ నుంచి అందరూ దంచి కొడుతూ వచ్చిన చోట కేఎల్ రాహుల్ (12) మళ్లీ విఫలమయ్యాడు. సొంత మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సున్నా చుట్టేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. రిషభ్ పంత్(99) ఔటైన కాసేపటికే విలియం ఓ రూర్కీ ఓవర్లో.. రాహుల్ వికెట్ కీపర్ బ్లండిల్ చేతికి దొరికాడు. దాంతో, టీ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది.
రోహిత్ సేన ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా 32 ఓవర్ల ఆట మిగిలి ఉంది. టెస్టులో ఓటమి తప్పించుకోవాలంటే భారత్ ఈ రోజంతా ఆడాల్సిన పరిస్థితి. అయితే.. చెన్నై టెస్టులో చెలరేగిన రవీంద్ర జడేజా(), రవిచంద్రన్ అశ్విన్‌లు ఈసారి మళ్లీ నిలబడాలి. ఆపద్భాందవుల అవతారం ఎత్తి జట్టును ఒడ్డున పడేయాలి. లేదంటే.. స్వదేశంలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియాకు ఓటమి తప్పకపోవచ్చు.
It’s time for Tea on Day 4 in Bengaluru.#TeamIndia reach 438/6 with a lead of 82 runs.
Stay tuned for the final session of the day.
Scorecard – https://t.co/FS97Llv5uq#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/8MwKQMewUU
— BCCI (@BCCI) October 19, 2024
చిన్నస్వామి స్టేడియంలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(99) విధ్వంసక ఇన్నింగ్స్‌కు తెరపడింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో 107 మీటర్ల సిక్సర్ బాదిన పంత్.. ఆ తర్వాత బౌలింగ్‌లో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో బౌల్డ్ అయ్యాడు. విలియం ఓరూర్కీ సంధించిన తొలి బంతిని పంత్ డిఫెన్స్ ఆడగా అది ఎడ్జ్ తీసుకొని తిన్నగా వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(11), రవీంద్ర జడేజా(0)లు ఆడుతున్నారు. టీమిండియా 77 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి సెషన్ నుంచి దూకుడుగా ఆడిన పంత్.. లంచ్ తర్వాత మరింత వేగం పెంచాడు. సర్ఫరాజ్‌ఖాన్()తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగులు జోడించాడు. దాంతో. భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.