IND vs NZ 1st Test : చిన్నస్వామి స్టేడియంలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(99) విధ్వంసక ఇన్నింగ్స్‌కు తెరపడింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో 107 మీటర్ల సిక్సర్ బాదిన పంత్.. ఆ తర్వాత బౌలింగ్‌లో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో బౌల్డ్ అయ్యాడు. విలియం ఓరూర్కీ సంధించిన తొలి బంతిని పంత్ డిఫెన్స్ ఆడగా అది ఎడ్జ్ తీసుకొని తిన్నగా వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(11), రవీంద్ర జడేజా(0)లు ఆడుతున్నారు. టీమిండియా 77 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి సెషన్ నుంచి దూకుడుగా ఆడిన పంత్.. లంచ్ తర్వాత మరింత వేగం పెంచాడు. సర్ఫరాజ్‌ఖాన్(150)తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగులు జోడించాడు. దాంతో. భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్వదేశంలో మరీ చెత్తగా 46 పరుగులకే ఆలౌట్ అయిన అవమానంంతో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. మూడో రోజు కివీస్‌ను త్వరగానే ఆలౌట్ చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల వరద పారిస్తోంది.
𝗢𝘂𝘁 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗣𝗮𝗿𝗸! 😍
Rishabh Pant smacks a 1⃣0⃣7⃣m MAXIMUM! 💥
Live – https://t.co/FS97Llv5uq#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/4UHngQLh47
— BCCI (@BCCI) October 19, 2024
ఓపెనర్లు రోహిత్ శర్మ(52), యశస్వీ జైస్వాల్(35)లు దూకుడుగా ఆడి తమ ఉద్దేశాన్ని చాటారు. ఈ ఇద్దరూ వెనుదిరిగాక విరాట్ కోహ్లీ(70) జతగా సర్ఫరాజ్ ఖాన్(150) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో వణికించిన మ్యాట్ హెన్రీ, విలియం ఓరూర్కీలను ఉతికేస్తూ కోహ్లీ, సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించారు. మూడో రోజు ఆట ముస్తుందనగా ఆఖరి బంతికి విరాట్ ఔటయ్యాడు.