బెంగుళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan), రిషబ్ పంత్‌లు భారత స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఆ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 177 రన్స్ జోడించారు. సర్ఫరాజ్ ఖాన్ వ్యక్తిగతంగా 150 రన్స్ చేసి ఔటయ్యాడు. మరో బ్యాటర్ పంత్ సెంచరీకి చేరువవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. భారత్ 84.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 408 రన్స్ చేసింది. సర్ఫరాజ్ 150 రన్స్ చేసి ఔట్ అవ్వగా, పంత్ 89 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.
End of a remarkable knock!
Sarfaraz Khan departs after scoring a brilliant 150(195) when the going got tough 👏👏#TeamIndia 408/4, lead by 52 runs
Live – https://t.co/FS97Llv5uq
#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/WcPWDTfVfH— BCCI (@BCCI) October 19, 2024
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన పంత్..
బెంగుళూరు: మాజీ కీపర ధోనీ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2500 రన్స్ చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అతను 62 ఇన్నింగ్స్‌లో ఆ మైలురాయిని చేరుకున్నాడు. గతంలో ధోనీ ఆ ఫీట్‌ను 69 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఆ ఘనతను చేరుకున్నాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో భారత స్కోరు 400 దాటింది. పంత్, సర్ఫరాజ్ సమయోచిత గేమ్‌తో ఇండియా లీడింగ్‌లోకి వెళ్లింది.