Rohit Sharma: మరో వరల్డ్ కప్ ఓటమి.. రోహిత్ వైదొలుగుతాడా..?
Rohit Sharma: అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆసీస్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాలలో విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే భారత అభిమానులు ఆందోళన చెందుతున్న మరో అంశం భారత సారథి రోహిత్ శర్మ గురించే..
Rohit Sharma: పుష్కరకాలం తర్వాత స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో గెలిచి మూడోసారి ట్రోఫీని ముద్దాడాలన్న భారత కలలు కల్లలయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆసీస్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాలలో విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే భారత అభిమానులు ఆందోళన చెందుతున్న మరో అంశం భారత సారథి రోహిత్ శర్మ గురించే.. 36 ఏండ్ల రోహిత్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతాడని చాలారోజులుగా గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో ఫైనల్ ఓటమి తర్వాత హిట్‌మ్యాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
టీ20లలో అయితే కష్టమే..
రోహిత్ వయసు ప్రస్తుతం 36 ఏండ్లు. వచ్చే వన్డే వరల్డ్ కప్ (2027) లో ఆడాలంటే అప్పటికీ అతడి వయసు 40 సంవత్సరాలు అవుతుంది. అప్పటిదాకా రోహిత్ ఆడటం అతిశయోక్తే అవుతుంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు రోహిత్, విరాట్లకు అనధికారిక రిటైర్మెంట్ ఇచ్చింది. 2022 నుంచి ఈ ఇద్దరూ ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. వీరిని 2024లో జరుగబోయే పొట్టి ప్రపంచకప్‌లో ఆడిస్తారనుకోవడం అతిశయోక్తే. అదీగాక ఈ ఫార్మాట్లో భారత్.. ఏడాదికాలంగా హార్ధిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి కొత్త కుర్రాళ్లను రాటుదేల్చే పనిలో ఉంది. అయితే రోహిత్‌కు 2025 వరకూ ఆడగలిగితే మరో ఐసీసీ ట్రోఫీ అందుబాటులో ఉంది.
Rohit Sharma led from front, with bat, played aggressive brand including in knock-outs, he had 2 great World Cups in 2019 & 2023.
– Still the trophy is far away for the great man. pic.twitter.com/BcFN1067E8
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
అప్పటివరకు ఆడతాడా..?
2025లో పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇది వన్డే ఫార్మాటా లేక టీ20 ఫార్మాటా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా 18 నెలల సమయం ఉంది. అప్పటివరకు రోహిత్ ఆడగలిగితే అతడికి మరో అవకాశం దక్కినట్టే. కానీ నిత్యం గాయాలతో సతమతమవుతూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కునే హిట్‌మ్యాన్ అప్పటివరకు ఆడటం అనుమానంగానే ఉంది.
ఇప్పటికిప్పుడు రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశమైతే లేదు. డిసెంబర్లో భారత్ – దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది. అప్పటివరకు రోహిత్ ఏదైనా ఆకస్మిక నిర్ణయం ప్రకటిస్తే తప్ప సారథ్య పగ్గాలను వదులుకోడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

