Loksabha Elections 2024 : కాంగ్రెస్ను దేశ ప్రజలు తిరస్కరించారని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌధరి అన్నారు. గత 70 ఏండ్లుగా ప్రజలకు రేషన్ ఉచితంగా ఇవ్వాలన్న ఆలోచన తమకు ఎందుకు రాలేదన్నది ఎస్పీ-కాంగ్రెస్ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్కు పట్టదని విమర్శించారు.
కాంగ్రెస్, ఎస్పీ నేతలు కేవలం తమ కుటుంబాలు బాగుపడటంపైనే దృష్టి సారిస్తారని అన్నారు. అందుకే ఆ పార్టీలను ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో పరిస్ధితిని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోనియా-మన్మోహన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో బాంబు పేలుళ్లు జరిగాయని అమిత్ షా గుర్తుచేశారు.
ఉగ్రదాడులు జరిగినా అప్పటి యూపీఏ ప్రభుత్వం దీటుగా బదులివ్వలేదని, తమ ఓటు బ్యాంక్ కోల్పోతామనే భయంతో మౌనంగా ఉందని ఆరోపించారు. తాము ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బిహార్లో ఎన్డీయే కూటమి మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, గతంలో వచ్చిన ఫలితాలు పునరావృతమవుతాయని అన్నారు.
Read More :
New born baby | వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన బాబు మృతి.. వనస్థలిపురంలో ఘటన