హైదరాబాద్ : వనస్థలిపురం(Vanasthalipuram) ఏరియా ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో(Doctors negligence) అప్పుడే పుట్టిన బాబు(New born baby) మృతి చెందాడు. బాధితులు తెలిపిన కథనం మేరకు.. హయత్నగర్కి చెందిన శిరీష అనే మహిళకు తెల్లవారు జామున 3 గంటలకి డెలివరీ చేసే సమయంలో బొడ్డు పేగు మొదటగా కత్తిరించ డంతో బాబు మృతి చెందాడు.
బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా హాస్పిటల్ వైద్యుల తీరు మారడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.