Sachin Tendulkar: సర్వీస్ గన్‌తో కాల్చుకున్న సచిన్ టెండూల్కర్ సెక్యూర్టీ గార్డు
Sachin Tendulkar: మాజీ క్రికెటర్ సచిన్ సెక్యూర్టీ గార్డు సూసైడ్ చేసుకున్నాడు. సర్వీస్ గన్‌తో కాల్చుకున్నాడు. ఈ ఘటన పట్ల ఎస్ఆర్పీఎఫ్ దర్యాప్తు చేపట్టింది. వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
జల్గావ్: మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కు భద్రత కల్పిస్తున్న దళంలోని స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జామ్నేర్ పట్టణంలోని తన స్వంత ఇంట్లో అతను కాల్చుకున్నట్లు తెలుస్తోంది. బలవన్మరణానికి పాల్పడిన ఆ పోలీసును ప్రకాశ్ కాప్డేగా గుర్తించారు. తన పూర్వీకుల గ్రామానికి వెళ్లేందుకు అతను కొన్ని రోజుల నుంచి లీవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వీస్ గన్‌తోనే తన మెడలో కాల్చుకున్నాడు. అతని వెంట వయసు మళ్లిన పేరెంట్స్ ఉన్నారు. భార్య, ఇద్దరు పిల్లలు, ఓ సోదరుడు కూడా ఉన్నారు. బుధవారం రాత్రి 1.30 నిమిషాలకు అతను ఆత్మహత్య చేసుకున్నట్లు జామ్నేర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కిరణ్ షిండే తెలిపారు. సూసైడ్ వెనుక ఉన్నకారణాలను కనుగునేందుకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ జవాన్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణ ద్వారా గుర్తించారు. కాప్డే మృతదేహానికి అటాప్సీ చేస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ కల్పిస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎస్ఆర్పీఎఫ్ వ్యక్తిగతంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

