టోక్యో: అందరి సహకరాంతోనే తనకు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించే ఘనత దక్కిందని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. తన ప్లానింగ్‌లో ఏనాడూ క్రీడలకు స్థానం లేదని, దేశం కోసం ఆడి బంగారు పతకం సాధిస్తానని అస్సలు ఊహించలేదని ఆయన తెలిపారు. స్టేడియానికి వెళ్లడం, అక్కడ స్నేహితులు జావెలిన్ విసురుతుంటే చూసి తాను విసరడం అంతా అనుకోకుండా జరిగిందని గుర్తుచేసుకున్నారు.
తన కుటుంబంలోగానీ, గ్రామంలోగానీ గుర్తింపు పొందిన క్రీడాకారులు ఎవరూ లేరని, అయినా అనుకోకుండా తాను జావెలిన్ త్రో పై మక్కువ పెంచుకుని సాధన చేశానని నీరజ్ చోప్రా తెలిపారు. ముందుగా ఆటల్లోకి రావాలన్న ఆసక్తి లేకపోయినా జావెలిన్ త్రో పై ఇష్టం ఏర్పడిన తర్వాత చాలా హార్డ్‌వర్క్ చేశానని, అందుకు అందరి నుంచి మంచి సహకారం లభించిందని ఆయన చెప్పారు. తన హార్డ్ వర్కే ఇప్పుడు తనను ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి తీసుకొచ్చిందన్నారు.
#WATCH | "Sports was never part of plan or to play for country & win a medal. No one in my family or in my village was into sports. It was coincidence that I went to stadium & started throwing javelin. I worked hard & everyone supported," says #Gold medallist Neeraj Chopra to ANI pic.twitter.com/loIpOiy5yu
— ANI (@ANI) August 8, 2021
ఇవి కూడా చదవండి
Smart Card | గుడ్ న్యూస్: ఆన్లైన్లో రైల్వే స్మార్ట్‌కార్డు రీచార్జ్
Smart Phone offer: ఎస్బీఐ కార్డుతో కొంటే ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
Photoshoot : ఫోజుకు సిగ్గుపడి వరుడిని కొలనులోకి తోసిన వధువు.. వైరల్ వీడియో
Bumper offer : బైకు కొంటే హెల్మెట్ ఫ్రీ.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా..!
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!