Photoshoot : ఫోజుకు సిగ్గుపడి వరుడిని కొలనులోకి తోసిన వధువు.. వైరల్ వీడియో
Photoshoot : జిలకర బెల్లం, తాళిబొట్టు, తలంబ్రాలు, మేళతాళాలు, పందిళ్లు..! ఒకప్పుడు పెండ్లి అంటే ఎక్కువగా వినపడే పదాలు ఇవి..! కానీ రానురాను ట్రెండ్ మారిపోయింది.

Photoshoot : జిలకర బెల్లం, తాళిబొట్టు, తలంబ్రాలు, మేళతాళాలు, పందిళ్లు..! ఒకప్పుడు పెండ్లి అంటే ఎక్కువగా వినపడే పదాలు ఇవి..! కానీ రానురాను ట్రెండ్ మారిపోయింది. దాంతో పెండ్లి కాకముందే వధూవరులు ఇద్దరూ ఫొటోషూట్‌కు వెళ్లడం అనే కొత్త సాంప్రదాయం ఇప్పుడు తప్పనిసరి తంతుగా మారిపోయింది. ఇక ఈ ఫొటో షూట్ల కోసం ఎవరి అభిరుచికి నచ్చిన లొకేషన్లను వారు ఎంచుకుంటున్నారు. కొందరు కొలనుల్లో, మరికొందరు నదుల్లో, ఇంకొందరు సముద్ర తీరాల్లో ఫొటోషూట్లకు వెళ్తున్నారు.
ఇక మరికొందరైతే అడవులను, ఆకాశాన్ని కూడా వెడ్డింగ్ ఫొటోషూట్లకు వాడుకుంటున్నారు. అయితే, ఈ ఫొటోషూట్ల సందర్భంగా కాబోయే దంపతులు చేసే చిలిపిచేష్టలు అన్నీఇన్నీ కావు. ఈ మధ్య అలాంటి ఫన్నీ వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో ఓ కొలను మధ్యలో ఉన్న వేదికపై వెడ్డింగ్ ఫొటోషూట్ జరుగుతున్నది. ఈ ఫొటోషూట్‌లో ఫొటోగ్రాఫర్ వధూవరులను వివిధ ఫోజులలో ఫొటోలు తీస్తున్నాడు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ఈ క్రమంలోనే వధూవరులిద్దరూ ఒకరినొకరు అల్లుకుని నిలబడాల్సిన రొమాంటిక్ ఫోజు గురించి ఫొటోగ్రాఫర్ వరుడికి వివరిస్తున్నాడు. వరుడితో ఆ భంగిమలో నిలబడి మరీ ఫొటోగ్రాఫర్ ఫోజును వివరిస్తుండటంతో వధువు సిగ్గు ఆపుకోలేకపోయింది. ఫొటోగ్రాఫర్‌ను, వరుడిని ఇద్దరినీ కలిపి కొలను నీళ్లలోకి తోసేసింది. వాళ్లిద్దరూ నీళ్లలోపడిపోగానే పగలబడి నవ్వింది. ఈ వీడియోను హెప్గుల్ 5 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఇప్పుడు తెగ నవ్వుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
Bumper offer : బైకు కొంటే హెల్మెట్ ఫ్రీ.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా..!
Chief Justice : దర్యాప్తు సంస్థల తీరుపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు..!
RBI: వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ
దేశంలో 24% పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bride
- groom
- photoshoot
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

