Chief Justice : దర్యాప్తు సంస్థల తీరుపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు..!
Chief Justice : దేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సహా వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: దేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సహా వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ( Chief Justice ) జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుప్రీంకోర్టుగా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ.. దర్యాప్తు సంస్థల తీరును తప్పుపట్టారు. తమకు ప్రాణహాని ఉందంటూ న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా సీబీఐ సహా వివిధ దర్యాప్తు సంస్థలు స్పందిచడం లేదని, వారికి ఏమాత్రం సాయపడటం లేదని సీజేఐ విమర్శించారు.
సీబీఐ తన తీరు మార్చుకోవడం లేదు. న్యాయమూర్తులు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ సీబీఐకి, ఐబీకి ఫిర్యాదు చేస్తే వారు సరిగా స్పందించడం లేదు. కనీసం వారికి ఎలాంటి సాయం కూడా అందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉన్నది అని సీజేఐ వ్యాఖ్యానించారు. అదేవిధంగా జడ్జి హత్య కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌పై కూడా సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇలాంటి చార్జిషీట్‌ను ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించారు.
చార్జిషీట్లో బలమైన సాక్ష్యాలను నమోదు చేయలేదని విమర్శించారు. పోలీసులు చార్జిషీట్ రూపొందించిన తీరుపై తనకు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. నిందితులకు బెయిల్ లభించేందుకు వీలుపడేలా చార్జిషీట్ రూపొందించినట్లుగా అనిపిస్తుందన్నారు. గత నెల 28న జార్ఖండ్‌లో ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ దారుణహత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయనను ప్రత్యర్థులు వ్యాన్‌తో తొక్కించి చంపేశారు.
ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టుకు తాజాగా సీబీఐకి నోటిసులు జారీచేసింది. జడ్జి హత్య కేసుకు సంబంధించి కోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆ నోటీసులలో ఆదేశించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల తీరుపై విమర్శలు గుప్పించిన సీజేఐ రమణ.. కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి
RBI: వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ
దేశంలో 24% పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cbi
- CJI
- Judge murder case
- NV Ramana
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

