Washington Sunder : సొంతగడ్డపై స్పిన్ పిచ్‌లతో ప్రత్యర్థుల భరతం పట్టే భారత జట్టు మళ్లీ అదే అయుధాన్ని ప్రయోగించింది. బెంగళూరు టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పుణేలో టర్నింగ్ పిచ్‌తో న్యూజిలాండ్ (Newzealand) ను కుప్పకూల్చింది. తొలి ఇన్నింగ్స్‌లో సంచలన ప్రదర్శనతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు వాషింగ్టన్ సుందర్ (Washington Sunder). రంజీ ట్రోఫీ నుంచి వస్తూ.. జట్టు తన నుంచి ఆశించిన రీతిలో మ్యాజిక్ చేశాడు. దాదాపు మూడేండ్లుగా తెలుపు జెర్సీకి దూరమైన అతడికి అనూహ్యగా దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
పునరాగమనం అదిరిపోయేలా.. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను మూడు వికెట్లకే పరిమితం చేస్తూ కివీస్ మిడిలార్డర్, టెయిలెండర్లను డగౌట్‌కు చేర్చాడు. రెండేండ్ల గ్యాప్ తర్వాత తొలి మ్యాచ్‌లోనే జట్టుకు కొండంత బలమయ్యాడు ఈ చెన్నై చిన్నోడు. ఏడుగురు కివీస్ బ్యాటర్లలో మీ ఫేవరెట్ వికెట్ ఎవరిది? అనే ప్రశ్నకు సుందర్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
T. I. M. B. E. R! 🎯
Cracker of a ball! 👌 👌
Washington Sundar with a breakthrough 🙌 🙌
Live ▶️ https://t.co/YVjSnKCtlI #TeamIndia | #INDvNZ | @Sundarwashi5 | @IDFCFIRSTBank pic.twitter.com/OC8VS7fnwT
— BCCI (@BCCI) October 24, 2024
‘నా కల నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమైన సిరీస్‌లో.. నన్ను తీసుకొని తుది జట్టులో ఆడించారు. అందుకు కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మకు ధన్యవాదాలు. ఇక.. ఏడు వికెట్లలో ఎవరిది అమూల్యం అంటే.. కచ్చితంగా రచిన్ రవీంద్రదే. ఎందుకంటే అప్పటికీ కివీస్ పటిష్ట స్థితిలో ఉంది. టీకి ముందు అతడిని బౌల్డ్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. టీ ముగించుకొని వచ్చాక డారిల్ మిచెల్ వికెట్ కూడా నా ఫేవరేట్ అని మ్యాచ్ అనంతరం సుందర్ తెలిపాడు. అంతేకాదు పుణే పిచ్ ఎలా తమకు సహకరించిందనే విషయం కూడా అతడు పంచుకున్నాడు.
Innings Break!
Superb bowling display from #TeamIndia! 💪
7⃣ wickets for Washington Sundar
3⃣ wickets for R AshwinScorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @Sundarwashi5 | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/TsWb5o07th
— BCCI (@BCCI) October 24, 2024
‘తొలి రోజు నుంచే బంతి టర్న్ అవుతుందని మాకు తెలుసు. తొలి సెషన్లో కొంచెం స్పిన్ అయింది. దాంతో, రెండో సెషన్లో ఇంకా టర్న్ అవుతుందని నేను అనుకోలేదు. కానీ, తేమ కూడా లేదు. అయినా సరే బంతి అనూహ్యంగా టర్న్ అయింది’ అని సుందర్ వెల్లడించాడు. దేశవాళీ, ఐపీఎల్లో నిలకడగా రాణించిన సుందర్ 2020-21లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో. ఆ తర్వాత ఫామ్ లేమి, గాయాలు.. అతడి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. అయితే.. 2023, 24లో అద్భుతంగా ఆడుతూ ఆల్‌రౌండర్ అనిపించుకున్న సుందర్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఇక ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. అందుకని బెంగళూరు టెస్టు ఓటమితో మేల్కొన్న భారత కెప్టెన్, కోచ్.. టర్నింగ్ పిచ్ కావాలని క్యురేటర్లకు చెప్పేశారు. బంతి బాగా స్పిన్ అవుతున్న పుణే పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్(7/59) రెచ్చిపోయాడు.
Make That SIX
Washington Sundar is making merry! 🙌 🙌
Live ▶️ https://t.co/YVjSnKCtlI #TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/tQ1i1siEuH
— BCCI (@BCCI) October 24, 2024
సుందర్ ధాటికి డారిల్ మిచెల్(18), టామ్ బ్లండిల్(3), గ్లెన్ ఫిలిఫ్స్(9), శాంట్నర్(33), సౌథీ(5), అజాజ్ పటేల్(4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోలేక మొదటి రోజే న్యూజిలాండ్ ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(10 నాటౌట్), యశస్వీ జైస్వాల్(6 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.