IIT Delhi Student Suicide | ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య.. మానసిక చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడి
IIT Delhi Student Suicide | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని మరణించాడు. అయితే ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని మరణించాడు. (IIT Delhi Student Suicide) అయితే ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని డియోగఢ్కు చెందిన 21 ఏళ్ల కుమార్ యాష్, ఐఐటీ ఢిల్లీలో ఎంఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్నేహితుడు, అక్కడి సిబ్బంది కిటికీని పగులగొట్టి గదిలోకి వెళ్లారు. రెండు టవల్స్‌తో ఉరి వేసుకున్న కుమార్‌ను కిందకు దించారు. వెంటనే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించగా ఆ విద్యార్థి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌కు చేరుకున్నారు. స్టూడెంట్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీస్ అధికారి తెలిపారు. అయితే మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్న మెడికల్ కార్డు ఆ రూమ్‌లో ఉన్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం కూడా మానసిక చికిత్స కోసం ఐఐటీలోని హాస్పిటల్‌కు అతడు వెళ్లినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

