Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కల సాకారమైంది. టీమిండియా ఆటగాడిగా పలు ఐసీసీ ట్రోఫీలు గెలుపొందిన విరాట్.. ఐపీఎల్‌లోనూ ‘ఛాంపియన్’ అనిపించుకున్నాడు. 17 ఏళ్లుగా తనను ఊరిస్తూ వస్తున్న ట్రోఫీని అహ్మదాబాద్ స్టేడియంలో ఎంతో మురిపెంగా చేతపట్టుకున్నాడు విరాట్. తన సుదీర్ఘ కెరియర్లో అందని ద్రాక్షలా మిగిలిన ఐపీఎల్ ట్రోఫీతో విరాట్ చేసిన సంబురం అంతా ఇంతా కాదు. ఆటగాడిగా ఎన్నో మైలురాళ్లు, రికార్డులు అధిగమించిన భారత క్రికెట్ స్టార్ వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టులో సభ్యుడు. ఐపీఎల్ విజేతగా నిలిచిన అతడి ఖాతాలోని టైటిళ్ల సంఖ్య ఆరుకు చేరింది.
టీమిండియా తరఫున విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైన కోహ్లీ ఐసీసీ ట్రోఫీల వీరుడిగా పేరుగాంచాడు. అండర్ -19 వరల్డ్ కప్ (U-19 World Cup 2008) హీరోగా సీనియర్ జట్టులోకి వచ్చిన అతడు.. అనతికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. స్వదేశంలో జరిగిన 2011లో వన్డే వరల్డ్ కప్‌తో తొలి ఐసీసీ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందని జట్టులో సభ్యుడైన కోహ్లీ.. ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీతో సిక్సర్ కొట్టాడు.
Virat Kohli’s 🏆 cabinet is updated:
✅ Under 19 2008
✅ ODI World Cup 2011
✅ Champions Trophy 2013
✅ T20 World Cup 2024
✅ Champions Trophy 2025
✅ IPL 2025#IPL #ViratKohli #RCB #IPL2025 pic.twitter.com/WK2WnyAACw— Cricbuzz (@cricbuzz) June 3, 2025
పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ దాటలేకపోయిన ఆర్సీబీ 18వ ఎడిషన్‌లో కప్పు గెలవాలనే కసితో ఆడింది. లీగ్ దశలో 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు క్వాలిఫయర్ 1లోనూ పంజా విసిరింది. బలమైన పంజాబ్ కింగ్స్‌ను 101కే ఆలౌట్ చేసి.. భారీ విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ రాణించిన విరాట్ 43 పరుగులతో జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం కృనాల్ పాండ్యా (2-17), భువనేశ్వర్(2-38)ల విజృంభణతో పంజాబ్ ఓటమి అంచున నిలిచింది. ఆఖర్లో శశాంక్ సింగ్ (61 నాటౌట్) పోరిడినా ఆర్సీబీ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. హేజిల్‌వుడ్ 20వ ఓవర్ చివరి బంతి వేయగానే ఉబికివస్తున్న కన్నీళ్లను దాచుకున్న రన్ మెషీన్.. భావోద్వేగానికి లోనయ్యాడు. చేతుల్లో తన ముఖాన్ని దాచుకొని.. ఇన్నాళ్లుగా మోస్తున్న గుండె బరువు దిగిపోయింది అన్నట్టు మైదానంలో కూలబడ్డాడు కోహ్లీ.
This isn’t just celebrations, it’s tears, hugs and screams.
This is what belief finally looks like. ❤️
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025
’18 ఏళ్లు అవుతోంది. ఆర్సీబీ కోసం నా శక్తినంతా ధారబోశాను. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఈ రోజు నేను ప్రశాంతంగా చిన్నపిల్లాడిలా నిద్రపోతాను’ అంటూ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు కోహ్లీ. అతడి మాటల్లో ఇన్ని రోజులు ఎంత మానసిక వేదన అనుభవించాడో అర్థమవుతోంది. అందుకే.. ఈసారి ఆర్సీబీ కప్ గెలుపొందడంతో అభిమానుల కలతో పాటు కోహ్లీ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ఈ సాలా కప్ నమదే అనే స్లోగన్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 18వ ఎడిషన్‌తో ఈ సాలా కప్ నమదు(మాది) అని తెగ మురిసిపోయింది.
He gave RCB his youth, his prime, his fire, his heart. ❤️
No complaints. ❌
No conditions. ❌
Just one dream. 🤌…..and it comes true. 🙏 pic.twitter.com/oPnh9XJy86
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025