TTD | హిమాయత్ నగర్, జూన్ 4 : తిరుమలేషుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హిమాయత్ నగర్లోని లిబర్టీ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు, చంద్రపభ వాహనంపై స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యల్లో తరలి రావడంతో స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గురువారం నాడు గజ వాహనంపై శ్రీవారి ఊరేగింపు, ఉదయం 10 గంటలకు శాంతి కల్యాణం, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుందని టీటీడీ ఉప కార్యనిర్వహణ అధికారి రమేష్,దాత వై.టివి త్రినాథబాబు తెలిపారు.