Virushka | స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) – అనుష్క శర్మ (Anushka Sharma) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ జంటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట.. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో మంది స్టార్స్‌కు ఆదర్శంగా నిలుస్తోంది. కాగా, తాజాగా అనుష్క (Anushka)పై కోహ్లీ (Kohli ) ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భార్యపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టారు. ఒక తల్లిగా ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని… ఆమె నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందుతున్నానని చెప్పారు.
‘వామిక (Vamika) మా జీవితంలోకి వచ్చాకా మాలో చాలా మార్పులు వచ్చాయి. వామికను చూసుకునే విషయంలో ఒక తల్లిగా అనుష్క చేసిన త్యాగాలు చాలా గొప్పవి. అనుష్కను చూస్తుంటే నా జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కోగలననే నమ్మకం కలుగుతుంది. జీవితాన్ని ఆమె చూసే కోణం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. దాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగడమనేదాన్ని నా భార్య నుంచే నేర్చుకున్నాను’ అంటూ అనుష్కపై ఉన్న ప్రేమను బయటపెట్టారు కోహ్లీ.
కాగా, అనుష్క, విరాట్ 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటలీలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ జంటకి 2021 జనవరిలో కుమార్తె వామిక పుట్టింది. ప్రస్తుతం వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read..
Viral News | పొద్దున్నే నక్క ముఖం చూశాడు.. సాయంత్రానికే కటకటాలపాలయ్యాడు..!
Bomb threats | ప్రముఖ నటులు అమితాబ్, ధర్మేంద్ర నివాసాలకు బాంబు బెదిరింపులు
AAP | ఢిల్లీ కేబినెట్లోకి ఇద్దరు కొత్త మంత్రులు.. ప్రకటించిన ఆప్
Upasana | డెలివరీపై ఉపాసన ఆసక్తికర అప్డేట్..!