Viral News | పొద్దున్నే నక్క ముఖం చూశాడు.. సాయంత్రానికే కటకటాలపాలయ్యాడు..!
Viral News | ఎవరికైనా అదృష్టం వరిస్తే వారిని ‘నక్కతోక తొక్కావు’ (stepped on the fox tail) అంటుంటాం. ప్రతి విషయంలోనూ లక్ వాళ్లనే పలకరిస్తుంటే ‘వీడు రోజూ నక్కముఖం చూస్తున్నాడురా..’ అనే సామెతలు చెబుతుంటారు. అయితే ఈ సామెతను సీరియస్‌గా తీసుకున్న ఓ వ్యక్తి అదృష్టం వరించేందుకు ఏకంగా నక్క (Fox)నే తెచ్చుకుని పెంచుకుంటున్నాడు.
Viral News | ఎవరికైనా అదృష్టం వరిస్తే వారిని ‘నక్కతోక తొక్కావు’ (stepped on the fox tail) అంటుంటాం. ప్రతి విషయంలోనూ లక్ వాళ్లనే పలకరిస్తుంటే ‘వీడు రోజూ నక్కముఖం చూస్తున్నాడురా..’ అనే సామెతలు చెబుతుంటారు. అయితే ఈ సామెతను సీరియస్‌గా తీసుకున్న ఓ వ్యక్తి అదృష్టం వరించేందుకు ఏకంగా నక్క (Fox)నే తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. అదృష్టమో.. దురదృష్టమో గానీ, చివరకు కటకటాలపాలయ్యాడు.
కర్ణాటక (Karnataka) రాష్ట్రం తుమకూరు (Tumakuru) జిల్లాలోని నాగవల్లి (Nagavalli) గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ (Lakshmikanth) అనే వ్యక్తి మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతాడు. లక్ష్మీకాంత్ కోళ్ల ఫామ్‌లు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవించే వాడు. అయితే, రోజూ ఉదయం నక్కముఖం చూస్తే అదృష్టం వరిస్తుందని భావించిన లక్ష్మీకాంత్ ఇంట్లో రెండు నక్క ఫొటోలను పెట్టుకున్నాడు. అయినా అదృష్టం కలిసి రాలేదని భావించి.. అడవికి వెళ్లి ఓ నక్కను తీసుకొచ్చి తన కోళ్లఫారంలో ఓ బోనులో పెట్టాడు. రోజూ ఉదయం దాని ముఖం చూసేవాడు. పని మీద బయటకు వెళ్లాలంటే కచ్చితంగా నక్క ముఖం చూసే వెళ్లేవాడు. దీంతో అతని వ్యాపారం లాభాలబాట పట్టి.. అతనికి కాసుల వర్షం కురుస్తుండేది.
అయితే, కోళ్లఫారంలో నక్క ఉందని తెలుసుకున్న గ్రామస్థులు.. ఒకరోజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నక్కను పెంచుకోవడం నేరమంటూ లక్ష్మీకాంత్‌ను అరెస్ట్ చేశారు. నక్కను అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. దీంతో ‘ఈ ఉదయం లక్ష్మీకాంత్ నక్క ముఖం చూడలేదేమో.. అందుకే జైలుపాలయ్యాడు’ అంటూ గ్రామస్థులు గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటనతో ‘నక్క’ సామెతలు నిజమని అనుకుంటున్నారు.
Also Read..
Upasana | డెలివరీపై ఉపాసన ఆసక్తికర అప్డేట్..!
Australia | భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు
Mukesh Ambani | అంబానీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

