Australia | ఆస్ట్రేలియా (Australian)లో ఓ భారతీయుడిని (Indian national) అక్కడి పోలీసులు (police) కాల్చి చంపారు. తమిళనాడుకు (Tamil Nadu) చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (Mohamed Rahmathullah Syed Ahmed) (32).. బ్రిడ్జింగ్ వీసాపై (Bridging Visa) ఆస్ట్రేలియా (Australian) లో నివసిస్తున్నాడు. మహమ్మద్.. సిడ్నీ రైల్వే స్టేషన్లో (Sydney railway station) ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడి కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రహమతుల్లా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ ( Sydney Morning Herald) న్యూస్ పేపర్ (newspaper) వెల్లడించిన వివరాల ప్రకారం.. సిడ్నీ ఆబర్న్ స్టేషన్లో (Sydney Auburn station ) అహ్మద్ ఓ క్లీనర్ (28)పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. ఆపై దాడికి యత్నించాడు. దీంతో పోలీస్ అధికారి అహ్మద్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు అహ్మద్ ఛాతీలోకి దూసుకెళ్లాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం (Indian Consulate) స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది.
Also Read..
Mukesh Ambani | అంబానీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ChatGPT | చాట్ జీపీటీకి పోటీగా మస్క్ ఏఐ
YS Sharmila | ఇదేం భాష?.. వైఎస్ షర్మిలపై మండిపడ్డ హైకోర్టు