YS Sharmila | ఇదేం భాష?.. వైఎస్ షర్మిలపై మండిపడ్డ హైకోర్టు
YS Sharmila | పాదయాత్రలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాడుతున్న భాషపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఏం భాష వినియోగిస్తున్నారు’అని ప్రశ్నించింది. హైకోర్టు షరతులు విధించి పాదయాత్రకు అనుమతిచ్చినప్పుడు, ఎలా ఉల్లంఘిస్తారని నిలదీసింది.
YS Sharmila | హైదరాబాద్,ఫిబ్రవరి 28( నమస్తే తెలంగాణ): పాదయాత్రలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాడుతున్న భాషపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఏం భాష వినియోగిస్తున్నారు’అని ప్రశ్నించింది. హైకోర్టు షరతులు విధించి పాదయాత్రకు అనుమతిచ్చినప్పుడు, ఎలా ఉల్లంఘిస్తారని నిలదీసింది. హైకోర్టు ఉత్తర్వులకు ఎందుకు కట్టుబడి లేరని అడిగింది. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని షర్మిలను ఆదేశించింది. షరతులకు కట్టుబడి ఉంటామని అఫిడవిట్ దాఖలు చేస్తే పరిశీలించాక పాదయాత్ర అనుమతులపై ఉత్తర్వులు జారీచేస్తామని తేల్చి చెప్పింది. రాజకీయ నేతల భాష గురించి పత్రికలు, టీవీల్లో రోజూ చూస్తూనే ఉన్నామని, అలాంటి నేతల నుంచి జనం ఏం నేర్చుకోవాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. మహబూబాబాద్ పరిధిలో పాదయాత్రకు గతంలో ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చేయటాన్ని సవాల్ చేస్తూ షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారించారు.
పాదయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చినా పోలీసులు రద్దు చేశారని షర్మిల తరుపు న్యాయవాది కోర్టకు విన్నవించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఎం రూపేందర్ స్పందిస్తూ, హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి షర్మిల రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నారని చెప్పారు. వీటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ చూడాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది అందించిన వీడియోను క్షణంపాటు చూసిన న్యాయమూర్తి ఇక చూడలేనని చెప్పారు. హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఎలాగని పిటిషనర్‌ను ప్రశ్నించారు. తాము హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని, స్థానిక ఎమ్మెల్యే ఆరోపణలకు జవాబు మాత్రమే చెప్పామని షర్మిల న్యాయవాది సమాధానమిచ్చారు. ఈ జవాబుపై న్యాయమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం లేదని, ఆ ఎమ్మెల్యే కోర్టు కేసులో లేరని గుర్తుచేశారు. హైకోర్టు విధించిన షరతులను అమలుచేస్తామని అఫిడవిట్ దాఖలు చేయాలని షర్మిలను ఆదేశిస్తూ, విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.
బైంసాలో ఆర్ఎస్ఎస్ ప్రదర్శనకు అనుమతి
నిర్మల్ జిల్లా భైంసాలో మార్చి 5న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7 వరకు ఆర్ఎస్ఎస్ నిర్వహించే శారీరక్ ప్రదర్శనకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ప్రదర్శనలో 500 మంది కంటే ఎకువ పాల్గొనరాదని, నేరచరిత్ర ఉన్నవారు ఉండొద్దని, మసీదు, బస్టాండ్‌కు 300 మీటర్ల దూరంలో ప్రదర్శన ఉండేలా చూడాలని, డీజే వంటి లౌడ్స్పీకర్లు వినియోగించరాదని షరతులు విధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

