ChatGPT | చాట్ జీపీటీకి పోటీగా మస్క్ ఏఐ
ChatGPT | చాట్ జీపీటీ దెబ్బ అన్ని సాఫ్ట్వేర్ సంస్థలపై పడింది. ఒకదాని వెనక ఒకటి.. కృత్రిమ మేధ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే ఏఐ టూల్ తీసుకొచ్చే పనిలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ నిమగ్నం కాగా, ఇప్పుడు ట్విట్టర్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా దృష్టి సారించారు.
ChatGPT | శాన్ఫ్రాన్సిస్కో: చాట్ జీపీటీ దెబ్బ అన్ని సాఫ్ట్వేర్ సంస్థలపై పడింది. ఒకదాని వెనక ఒకటి.. కృత్రిమ మేధ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే ఏఐ టూల్ తీసుకొచ్చే పనిలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ నిమగ్నం కాగా, ఇప్పుడు ట్విట్టర్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా దృష్టి సారించారు. చాట్ జీపీటీకి దీటుగా, పోటీగా ఒక ఏఐ టూల్‌ను అభివృద్ధి చేయాలని ఆయన కొందరు నిపుణులతో ఇటీవల చర్చలు జరిపారు. ఏఐ టూల్ అభివృద్ధి చేయడానికి త్వరలోనే ఓ రిసెర్చ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవల దుబాయిలో జరిగిన ఓ సమ్మిట్‌లో పాల్గొన్న మస్క్.. నాగరిక సమాజ భవిష్యత్తుకు ఉన్న అతిపెద్ద ప్రమాదాల్లో ఏఐ ఒకటని పేర్కొన్నారు. ఏఐ భద్రతను నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆయనే ఏఐ టూల్ తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
ఏఐ టూల్స్ అభివృద్ధిపై మెటా దృష్టి
భవిష్యత్తు మొత్తం ఏఐ ఆధారంగానే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ టూల్స్‌ను జోడించాలని మెటా సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ నిర్ణయించారు. ఇందుకుగానూ మెటాలో ఏఐ టూల్స్ అభివృద్ధి కోసం నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్నాప్‌చాట్ కూడా ఒక ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

