Virat Kohli | డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో తొలి సిరీస్కోసం భారత జట్టు (Team India) పక్కాగా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో జూన్ 20న జరుగబోయే తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన. ఇప్పటికే ఆటగాళ్లంతా ఇంగ్లండ్ చేరుకున్నారు. సిరీస్ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండటంతో జట్టు ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో లండన్‌లోని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) నివాసానికి పలువురు స్టార్ క్రికెటర్లు వెళ్లినట్లు తెలిసింది. టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, పేసర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కోహ్లీ ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. వీరికి కోహ్లీ ఫ్యామిలీ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు మరో రెండు రోజులే ఉంది. జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఇరుజట్లకు ఇది మొదటి సిరీస్. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సారథ్యంలో చివరిసారిగా 2007లో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజేతగా నిలిచిన టీమిండియా.. ఈసారి ట్రోఫీ కొల్లగొట్టాలనే కసితో ఉంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం అనిపిస్తోంది. ఇక ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఇంగ్లండ్ నుంచి హుటాహుటిన స్వదేశం వచ్చిన గంభీర్ త్వరలోనే జట్టుతో కలవనున్నారు.
Also Read..
Sachin Tendulkar: రెడిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్
ప్రిన్స్‌కు పరీక్ష!.. భారత టెస్టు జట్టుకు గిల్ 37వ కెప్టెన్
ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సోఫీ డెవిన్