ఆక్లాండ్: న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు సారథి సోఫీ డెవిన్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత ఆమె ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోనుంది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇప్పటిదాకా 152 వన్డేలు ఆడిన 35 ఏండ్ల ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. 3,990 పరుగులు చేసింది. ఇందులో 8 శతకాలు, 16 అర్ధ శతకాలున్నాయి. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన డెవిన్.. 107 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. కివీస్ తరఫున అత్యధిక పరుగులు (వన్డేల్లో) చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్న డెవిన్.. వికెట్ల విషయంలో రెండో స్థానంలో నిలిచింది.