న్యూఢిల్లీ: రెడిట్ సోషల్ మీడియా సంస్థకు.. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. క్రీడా వర్గాల్లో, క్రీడా అభిమానుల్లో తమ ఫ్లాట్‌ఫామ్‌ను విస్తరించాలన్న ఉద్దేశంతో సచిన్‌ను అంబాసిడర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. తన అఫీషియల్ రెడిట్ అకౌంట్ ద్వారా సచిన్ అభిమానులకు అందుబాటులో ఉండాడు. ఆ ఫ్లాట్‌ఫామ్‌లో యూజర్స్‌తో యాక్టివ్‌గా ఎంగేజ్ అవుతాడు. సబ్రెడిట్స్తో చర్చల్లో సచిన్ పాల్గోననున్నాడు. పర్సనల్ స్టోరీలు, మ్యాచ్ విశ్లేషణలు, విశిష్టమైన కాంటెంట్‌ను తన ఫ్యాన్స్ సచిన్ షేర్ చేసుకోనున్నారు. భారత క్రికెట్, భారతీయ క్రీడల గురించి రెడిటర్స్తో చర్చించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సచిన్ పేర్కొన్నారు. ఫ్యాన్స్‌తో కొత్త రీతిలో తమ అనుభవాల్ని పంచుకునే అవకాశం వచ్చిందన్నారు.