Virat kohli | ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం టీమ్ ఇండియా ఆటగాళ్లు దుబాయ్ (Dubai) చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు ఆటగాళ్లంతా నెట్స్‌లో చమటోడుస్తున్నారు. ఈ టూర్లో ఆటగాళ్లకు బీసీసీఐ పది షరతులు పెట్టిన విషయం తెలిసిందే. బీసీసీఐ (BCCI) రూల్స్‌తో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
రూల్స్ ప్రకారం ఈ టూర్లో క్రికెటర్ల ఫ్యామిలీ, అధిక లగేజ్, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించలేదు. దీంతో విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత చెఫ్ (personal chef)ను తీసుకెళ్లలేని పరిస్థితి. డైట్ విషయంలో కఠినంగా ఉండే కోహ్లీకి ఇది పెద్ద సమస్యగా మారింది. దీంతో అతను తన డైట్ ఫుడ్ (Diet food)ను బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా చెఫ్ లేకపోవడంతో లోకల్ టీమ్ మేనేజర్‌కు చెప్పి తనకు కావాల్సిన వాటిని తెప్పించుకున్నాడు. కోహ్లీ అభ్యర్థన మేరకు ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లను తెప్పించి కోహ్లీకి అందించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆ ఫుడ్‌ను కోహ్లీ అక్కడే తినేసి.. మరొక ప్యాకెట్‌ను జర్నీలో తినేందుకు తీసుకెళ్లాడు.
కాగా, కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న ఓ కీలక ఆటగాడు బీసీసీఐ నిబంధనలను తుంగలో తొక్కి భారీ లగేజీని స్వదేశానికి తీసుకొచ్చినట్టు తెలిసిందే. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు వెళ్లే ఒక ఆటగాడు.. 150 కిలోల వరకు (ఆ తర్వాత బీసీసీఐ చెల్లించదు) మాత్రమే లగేజీని తెచ్చుకునే అవకాశముంది. కానీ సదరు క్రికెటర్ మాత్రం ఏకంగా 27 బ్యాగుల్లో 250 కిలోల లగేజీని తెచ్చినట్టు ప్రముఖ హిందీ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. బ్యాగుల్లో 17 బ్యాట్లు, ఆ ఆటగాడి కుటుంబం, వ్యక్తిగత సిబ్బంది కోసం కొనుగోలు చేసిన విలువైన వస్తువులున్నట్టు తెలుస్తోంది. బోర్డుతో తనకున్న పరిచయాలతో అతడు లగేజీ బిల్ మొత్తం బీసీసీఐ ఖాతాలోనే వేసినట్టు సమాచారం. అయితే ఆ క్రికెటర్ ఎవరు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. దీంతో ఈ టూర్లో క్రికెటర్లకు బీసీసీఐ కఠిన బంధనలు పెట్టినట్లు తెలిసింది.
Also Read..
IPL | ఆగయా ఐపీఎల్ షెడ్యూల్.. మార్చి 23న ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్