Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కోహ్లీ, రోహిత్ భారీ విరాళం..? నెట్టింట వైరలవుతున్న న్యూస్
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద బాధితులకు టీంఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ), జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) కూడా భారీగా విరాళం ఇచ్చినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 1000 మందికిపైనే గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాద బాధితులకు, మృతుల కుటుంబాలకు కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు రైలు ప్రమాద బాధితులకు (Odisha Train Accident Victims) ప్రభుత్వాలే కాకుండా.. సెలబ్రిటీలు, క్రికెటర్లు భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ (MS Dhoni) ఒడిశా రైలు బాధితులకు రూ.60 కోట్లు విరాళంగా అందించినట్లు పలు వెబ్‌సైట్స్‌లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. తాజాగా టీంఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ), జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) కూడా రైలు ప్రమాద బాధితులకు భారీగా విరాళం ఇచ్చినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒడిశా సహాయ నిధికి కోహ్లీ రూ.30 కోట్లు డొనేట్ చేయగా.. రోహిత్ రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చాడంటూ నెట్టింట, పలు వెబ్సైట్లలో వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో కూడా నిజం లేదని తెలుస్తోంది.
https://twitter.com/TheNameIsSaiii/status/1665962702420979712?s=20
Also Read..
Tractor Crushes Car | కారుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. షాకింగ్ వీడియో
Odisha Train Accident | పరిహారం కొట్టేసేందుకు కొత్త తరహా మోసం.. చనిపోయింది మా వాళ్లే అంటూ డ్రామాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

