Fazal Rehman : సీనియర్ జర్నలిస్ట్ ఫజల్ రెహమాన్ (Fazal Rehman) కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్(Cancer)తో పోరాడుతున్న ఆయన శుక్రవారం తనువు చాలించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS)లో చికిత్స పొందుతూ ఫజల్ తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని కాసేపట్లో నిమ్స్ నుంచి హనుమకొండకు తరలించనున్నారు. ఆయన స్వగ్రామం హుస్నాబాద్‌లో శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
హుస్నాబాద్‌కు చెందిన ఫజల్ రెహమాన్ జర్నలిజంలో నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందించారు. రూరల్ రిపోర్టర్ నుంచి ఎడిటర్ స్థాయికి ఎదిగిన ఆయన ఎందరినో పాత్రికేయులుగా తీర్చిదిద్దారు. సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో పని చేసిన ఫజల్ ఈ తరానికి తమ ప్రాంతంపై అవగాహన కల్పిస్తుండేవారు. ఫజల్ మృతి పట్ల పలువురు జర్నలిస్ట్‌లు సంతాపం తెలిపారు.