MIW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ బ్యాటర్లు సంజీవన సంజన(45), నికోల క్యారీ(40)లు దంచేశారు. వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఉతికేస్తూ డెత్ ఓవర్లలో బౌండరీల మోత మోగించారు. దాంతో.. ఒక దశలో 120 దాటడమే గగనం అనుకున్న ముంబై అనూహ్యంగా 154 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలో తడబడినా చివరకు భారీ స్కోర్‌తో ఆర్సీబీకి షాకిచ్చింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఒక్క పరుగు ఇవ్వని లారెన్ బెల్ తన రెండో ఓవర్లోనే ఓపెనర్ అమేలియా కేర్(4)ను షార్ట్ పిచ్ బంతితో బోల్తా కొట్టించింది. కాసేపటికే డీక్లెర్క్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ వచ్చిన నాట్ సీవర్ బ్రంట్(4)ను రీచా ఘోష్ రెప్పపాటులో స్టంపౌట్ చేసింది. దాంతో.. 35 పరుగులకే ముంబై రెండు ప్రధాన వికెట్లు పడ్డాయి. ఇద్దరు వెంటవెంటనే ఔటైనా యువ ఓపెనర్ కమలిని(32) ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఆర్సీబీ బౌలర్ల లయను దెబ్బతీస్తూ బౌండరీలతో చెలరేగింది. బెల్, డీక్లెర్క్ ఓవర్లో తను ఫోర్లతో స్కోర్‌బోర్డును ఉరికించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(20) కాస్త కుదురుకున్నాక శ్రేయాంక ఓవర్లో భారీ సిక్సర్ కొట్టి స్కోర్ 60 దాటించింది.
Making a statement 🔥
🎥 Mumbai Indians’ Sajeevan Sajana is smashing the ball hard 👏
Updates ▶️ https://t.co/IWU1URl1fr#TATAWPL | #KhelEmotionKa | #MIvRCB | @mipaltan pic.twitter.com/dkiiO3CL1B
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
కానీ, అదే ఓవర్లో కమలిని స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డయ్యింది. ఫలితంగా 63 వద్ద ముంబై మూడో వికెట్ పడింది. కాసేపటికే హర్మన్‌ప్రీత్ సైతం వెనుదిరిగింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన సంజీవన సంజన(45) నికోల క్యారీ(40)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా సంజన పెద్ద షాట్లతో విరుచుకుపడడంతో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కారీ సైతం బ్యాట్ ఝులిపించగా ఐదు ఓవర్లలోనే ఈ ద్వయం 68 రన్స్ రాబట్టింది. చివరి ఓవర్లో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో ముంబై 154కే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో డీక్లెర్క్ నాలుగు వికెట్ల(4-26)తో రాణించింది.
👍😎
Thumbs up if you have a four-wicket haul in the #TATAWPL season opener!
Nadine de Klerk finishes with 4/26 ❤️
Updates ▶️ https://t.co/IWU1URl1fr#KhelEmotionKa | #MIvRCB pic.twitter.com/WMEzVc9Fyf
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026