Hitech City | హైటెక్ సిటీలో కుంగిన రోడ్డు.. భయభ్రాంతులకు గురైన వాహనదారులు..!
కొండాపూర్, జనవరి 9 : హైటెక్ సిటీలోని సైబర్ గేట్ వే(Cyber Gateway) ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుతం ఏర్పడడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యాయి.
కొండాపూర్, జనవరి 9 : హైటెక్ సిటీలోని సైబర్ గేట్ వే(Cyber Gateway) ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుతం ఏర్పడడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యాయి. అయితే.. వెంటనే అప్రమత్తమైన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిన చోట భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులను అలర్ట్ చేస్తూ పక్కనుంచి వెళ్లాలని చెబుతున్నారు.
సైబర్ గేట్‌వే రోడ్డుపై కుంగుబాటు కారణంగా భారీ గుంత ఏర్పడడంతో వాహనదారులు కంగుతిన్నారు. వందలాదిమంది రాకపోకలు సాగించే రోడ్డు కావడంతో అప్రమత్తమైన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిన ప్రాంతానికి అడ్డుగా భారీకేడ్లు పెట్టి ప్రమాదాలు జరగకుండా చూశారు. వాహనదారులకు పక్క నుంచి వెళ్లాలని సూచిస్తూ ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అదృష్టవశాత్తూ రోడ్డు కొద్దిగా కిందకు కుంగిన వెంటనే అప్రమత్తవడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్డు కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

