Odisha Train Accident | పరిహారం కొట్టేసేందుకు కొత్త తరహా మోసం.. చనిపోయింది మా వాళ్లే అంటూ డ్రామాలు
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే.. వీరిలో చాలామంది ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే.. వీరిలో చాలామంది ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. దీంతో వారిని గుర్తుపట్టాలని మృతదేహాల ఫొటోలను తీసి వెబ్సైట్లో ఉంచారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న దురాశపరులు కొత్త నాటకానికి తెర లేపుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కొట్టేసేందుకు చనిపోయింది తమ వాళ్లేనంటూ నకిలీ డాక్యుమెంట్లతో శవాలను తీసుకెళ్లిపోతున్నారు. తాజాగా ఈ మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.
మోసం బయటపడిందిలా..
ఒడిశా కటక్ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన గీతాంజలి గుప్తా (35) తన భర్త బిజయ్ దత్తా (40) కనిపించడం లేదని బహనగకు వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడని, అప్పట్నుంచి తన ఆచూకీ తెలియట్లేదని పోలీసులకు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రమాద బాధితులను తరలించిన ఆస్పత్రులకు కూడా వెళ్లానని అయినా లాభం లేకుండా పోయిందని ఏడ్చేసింది. దీంతో పోలీసులు ఆమెను ఒడిశా ప్రమాద మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని సూచించారు. కొన్ని ఫొటోలు చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతనే తన భర్త అని చెప్పింది.
డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు గీతాంజలి ఆధార్ కార్డ్‌ను అందజేసింది. అయితే అందులో గీతాంజలి వయస్సు 60 ఏండ్లుగా ఉంది. కానీ ఆమె అంత వయస్సు ఉన్నట్లుగా కనిపించలేదు. పైగా ఆమె ప్రవర్తన కూడా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆధార్ కార్డ్ ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించారు. అప్పుడు గీతాంజలి భర్త బిజయ్ బతికే ఉన్నాడని తెలిసింది. అంతేకాదు అతను కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించలేదని వెల్లడైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల పరిహారం కోసమే ఇలా నకిలీ పత్రాలతో వచ్చానని ఒప్పుకుంది. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

