రామన్నపేట, జనవరి 9 : రామన్నపేట మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షునిగా నీర్నేముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి (Kandimalla Gopal Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా వెలగపురి జనని, కోళ్ళ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గంగాదేవి స్వామి, కార్యదర్శులుగా బద్దం యాదమ్మ, బంటిక శ్రీను, చిల్ల మధురవేణి, నారపాక మాధవి
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సర్పంచ్ల ఫోరం ఎన్నిక కార్యక్రమంలో రామన్నపేట మండలంలోని పలువురు గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. కొమ్మాయిగూడెం సర్పంచ్ మారపల్లి మల్లారెడ్డి, రామన్నపేట సర్పంచ్ గారికి సత్యనారాయణ, శోభనాధపురం సర్పంచ్ కంచి మధుసూదన్, జనం పెళ్లి సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, ఇస్కిల్ల సర్పంచ్ పైల్ల చందన వెంకటరెడ్డి, బాచుప్పల మాధవి భూపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు గంగుల రాజిరెడ్డి జినుకల ప్రభాకర్ భక్తులకు కృష్ణ గౌడ్ జినూకల ప్రభాకర్, పూస బాలకృష్ణ నంద్యాల బిక్షం రెడ్డి మేడి రవిచంద్ర గుత్త నర్సిరెడ్డి, ఎండి జమ్మిరుద్దీన్ బొడ్డు సురేందర్రావు ఎర్ర శేకర్, ఆవుల నరసింహ, నోముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.