శనివారం 04 జూలై 2020
Sports - Apr 27, 2020 , 09:09:30

ఖాళీ మైదానాలైనా ఇబ్బందే: నాద‌ల్‌

ఖాళీ మైదానాలైనా ఇబ్బందే:  నాద‌ల్‌

న్యూఢిల్లీ:  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీల‌న్నీ స్తంభించిపోవ‌డంతో చాలా నిరాశగా ఉంద‌ని టెన్నిస్ స్టార్ రాఫెల్ నాద‌ల్ అంటున్నాడు. కొవిడ్‌-19 కార‌ణంగా ప్రొఫెష‌న‌ల్ టెన్నిస్ టోర్నీల‌న్నింటినీ జూలై చివ‌రి వ‌ర‌కు వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే వైర‌స్ ప్ర‌భావం త‌గ్గాక కూడా ఖాళీ మైదానాల్లో ఆడ‌టం కూడా కష్ట‌మే అని నాద‌ల్ అంటున్నాడు. 

`అంత‌ర్జాతీయ టోర్న‌మెంట్ జరుగుతుందంటే.. ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కున్నా.. దాని వెనుక చాలా మంది క‌ష్టించాల్సి ఉంటుంది. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల కోసం సిబ్బంది శ్ర‌మించాలి. ఇక వారం, వారం ప్ర‌యాణాలు, ఇంటికి దూరంగా హోటల్స్‌లో ఉండాల్సిందే ఇదంతా శ్రేయ‌స్క‌ర‌మైన‌ది కాదు. అందుకే ఆట‌లు తిరిగి ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయి అని కూడా ఆలోచించ‌డం లేదు` అని నాద‌ల్ అన్నాడు.


logo