తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్..!
ఈ గ్రామంలో హోలీ రంగులకు బదులుగా తేళ్లతో ఆడతారు. మీరు విన్నది నిజమే.. రంగులతో కాకుండా తేళ్లతో హోలీ అడతారు.

ఎటావా : దేశంలోని చాలా నగరాలు హోలీని జరుపుకునేందుకు తమదైన రీతిలో ఉన్నాయి. బృందావనంలో వర్షంలో తేలియాడుతూ హోలీని పూలతో జరుపుకున్నారు. కాశీలోని మణికర్ణిక ఘాట్ వద్ద చనిపోయినవారి బూడిదతో హోలీ ఆడారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లా పరిధిలోని ఒక గ్రామంలో హోలీ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ గ్రామంలో హోలీ రంగులకు బదులుగా తేళ్లతో ఆడతారు. మీరు విన్నది నిజమే.. రంగులతో కాకుండా తేళ్లతో హోలీ అడతారు.
సాధారణంగా తేలు పేరు చెప్పగానే భయపడుతుంటాం. కానీ ఎటావా పరిధిలోని సోంతనా గ్రామంలో హోలీ రోజున వందలాది తేళ్లను చూడొచ్చు. వీటితో ఆడుతున్నా, ఒకరిపై ఒకరు విసురుఉన్నా గ్రామస్తులను తేళ్లు ఏమీ అనకపోవడం విశేషం. ఈ శాస్త్రీయ యుగంలో ఈ దృశ్యం రహస్యం వలె కనిపిస్తుంది.
హోలీ వేదిక డ్రమ్ మోగగానే వందలాది తేళ్లు వారి జేబుల నుంచి బయటకు తీస్తారు. అవి ఒక్కసారిగా రావడం చూస్తే హోలీ రోజున వారిని పలకరించడానికి బయటకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. పిల్లలు తేళ్లను పట్టుకుని ఆడుకుంటారు. ఒకరిపై ఒకరు విసురుకుంటారు. వాటిని నెత్తిపైన పెట్టుకుని పరిగెత్తుతుంటారు. గత కొన్నేండ్లుగా ఇదే మాదిరిగా హోలీ కొనసాగుతుండటం మరీ విశేషం.

సోంతనా గ్రామం వెలుపల భైన్సన్ అనే పురాతన మట్టిదిబ్బ ఉంది. ప్రజలు సాధారణంగా తొలగించే ఈ మట్టిదిబ్బపై వేలాది ఇటుక, రాళ్ల ముక్కలు పడి ఉన్నాయి. మామూలు రోజుల్లో ఇక్కడ ఏవీ కనిపించవు. అయితే, హోలీ పూర్ణిమ రెండవ రోజు సాయంత్రం గ్రామ పెద్దలు, పిల్లలు మట్టిదిబ్బపై గుమిగూడి పాటలు పాడటం ప్రారంభింగానే ఇటుకలు, రాళ్ళ మధ్య నుంచి వేలాది విషపు తేళ్లు బయటకు వస్తాయి. వాటిని తీసుకుని అరచేతిలో ఉంచుకొని శరీరాలపై దొర్లించుకుంటారు.
మట్టిదిబ్బ నుంచి బయలుదేరే ముందు గ్రామ పెద్దల ఆశీర్వాదం తీసుకొని తేళ్లను అక్కడే వదిలేస్తారు. మరుసటి రోజు చూస్తే మట్టిదిబ్బ మీద ఒక్క తేలు కూడా కనిపించదని గ్రామస్తుడు కృష్ణ ప్రతాప్ సింగ్ బదౌరియా చెప్పారు. ఈ సంప్రదాయం వందల ఏండ్లుగా కొనసాగుతున్నదని పూర్వీకుల ద్వారా తెలుసుకున్నామని, ఇప్పటికీ ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌లో త్వరలో మూడో వ్యాక్సిన్‌కు ఆమోదం : డాక్టర్ రెడ్డీస్
వ్యాక్సిన్ తీసుకున్న పుతిన్‌కు సైడ్ ఎఫెక్ట్స్
తేడాలు మరచి కలిసి సాగుదాం : కమలా హారిస్ హోలీ సందేశం
చైనాలో చిక్కుకున్న ‘ఎవర్ గివెన్’ ట్రాలీ.. నిలిచిన ట్రాఫిక్
అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్’
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Etawah
- Holi
- scorpions
- Utter Pradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

